E-Paper
Advertisement

Mangalavaram: మంగళవారం మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్టోరీ ఇదేనా..?

Mangalavaram: మంగళవారం మూవీ.. ట్రైలర్ రిలీజ్.. స్టోరీ ఇదేనా..?
Advertisement

Mangalavaram: ఆర్ఎక్స్ 100.. మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఒకరకంగా సినీ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టాడు ఈ డైరెక్టర్. అలాంటి ట్రెండ్ సెట్టర్ డైరెక్షన్లో వస్తున్న మరో చిత్రం సెన్సేషన్ సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో కూడా పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఆర్ఎక్స్ 100లో పాయల్ రాజ్ పుత్ కుర్రకారును ఉర్రూతలూగించింది.

అజయ్ భూపతి డైరక్షన్ లో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో వస్తున్న మంగళవారం మూవీ ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. ఒక్క ట్రైలర్ తో భయాన్ని పీక్స్ కి తీసుకువెళ్తున్న ఈ మంగళవారం కథా.. కాన్సెప్ట్ ఏంటో క్లారిటీగా తెలుసుకుందాం పదండి. ఒకే ఒక సినిమాతో అందరి దృష్టిని తన వైపు ఆకర్షించిన అజయ్ ఆ తర్వాత మహాసముద్రం మూవీతో మెప్పించలేక విఫలమయ్యాడు. ఇప్పుడు మంగళవారంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

Advertisement

మరి ఈ చిత్రం ఎటువంటి సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే ఒక్క ట్రైలర్ తోనే ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించి ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ ఫుల్ అయ్యాడు. ఇక ఈసారి సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ , పాటలు చూసిన ఎవరికైనా స్క్రీన్ పై బొమ్మ అదిరిపోతుంది అని అర్థమవుతుంది.ఈ నేపథ్యంలో విడుదలైన చిత్రం ట్రైలర్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది.

పైగా మంగళవారం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించారు మూవీ మేకర్స్. ఇంతకీ ట్రైలర్ లో ఏముందో తెలుసా..? ట్రైలర్ ఓపెన్ అయిన వెంటనే.. ఒక ఊరు ..అందులో గ్రామ దేవత కనిపిస్తుంది. ఆమెకు ఇష్టమైన మంగళవారం రోజునే అక్కడ హత్యలు జరుగుతుంటాయి.టైటిల్ కి మంగళవారం అన్న పేరు ఎందుకు వచ్చిందో ట్రైలర్ స్టార్టింగ్ లోనే చూపించేశారు. దానికి తోడు గోడలపై అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తుల పేర్లు ఎవరో రాస్తున్నారు. ఇంతకీ రాసేది ఎవరు? అసలు ఈ హత్యల వెనక కారణం ఏంటి? ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు? అనే విషయాలను చూపించి చూపించినట్టుగా ట్రైలర్ ను ఆద్యంతం ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లారు.

Advertisement

ఆ ఊరి గ్రామ దేవత అయిన మాలచ్చమ్మ అమ్మకి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు ఊరిలో జరుగుతున్న మర్డర్లు పెద్ద మిస్టరీగా మారుతాయి. ఇక ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్ర నందితా శ్వేత పోషించింది. మరో పక్క చైతన్య కృష్ణకు క్రూరమైన వ్యక్తి పాత్రలో సూపర్ ఎలివేషన్ ఇచ్చారు. అలాగే మరొక విలన్ గా శ్రీతేజాను చూపించారు. ఇక ఈ పాత్రల మధ్య జరుగుతున్న సంఘర్షణ ,పోరాటం ఒక పక్క .. గ్రామంలో జరుగుతున్న దారుణాలు మరొకపక్క అద్భుతంగా ట్రైలర్ లో ఆవిష్కరించారు.

ఓవరాల్ గా మంగళవారం ట్రైలర్ ఓ మంచి హారర్, థ్రిల్లర్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చిత్రం ఎంతవరకు నిలబడుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో మాత్రం ఫుల్ సక్సెస్ అయింది. స్వాతి గునంపాటి, సురేష్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ మూవీ థియేటర్లలో ఎటువంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×