BigTV English

Suresh Raina: క్రికెటర్ నుండి రెస్టారెంట్ ఓనర్‌గా.. రైనా కొత్త బిజినెస్..

Suresh Raina: క్రికెటర్ నుండి రెస్టారెంట్ ఓనర్‌గా.. రైనా కొత్త బిజినెస్..


Suresh Raina: మామూలుగా ఒక రంగంలో సరిపడా డబ్బు, ఫేమ్ అనేది సంపాదించుకున్న తర్వాత బిజినెస్‌లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు కొందరు. అందులోనూ ముఖ్యంగా ఫుడ్ బిజినెస్‌లో ఎంటర్ అవ్వడానికే ఇష్టపడతారు. ఇప్పటికే చాలామంది సినీ తారలు ఫుడ్ బిజినెస్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అవ్వగా.. ఇప్పుడు క్రికెటర్లు కూడా అదే బాటపట్టారు. అందులో ముందుగా సురేశ్ రైనా తన పేరును నమోదు చేసుకున్నాడు.

యూరోప్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ‘రైనా’ అనే పేరుతో సురేశ్ రైనా.. తన మొదటి రెస్టారెంట్‌ను శుభారంభం చేశాడు. కేవలం ఇండియన్ క్యూసిన్‌తో ఇది ఫారినర్స్‌ను ఆకట్టుకోనుంది. ఎమ్ ఎస్ ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన అదే రోజు.. రైనా కూడా రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. అంతే కాకుండా ధోనీని, రైనాను వేర్వేరుగా కాకుండా ఒకే వ్యక్తిగా చూస్తారు క్రికెట్ ఫ్యాన్స్. ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా రైనా అంత యాక్టివ్‌గా లేడు. అందుకే క్రికెట్ అభిమానులు తనను గ్రౌండ్‌లో మిస్ అవుతున్నారు. కానీ రైనా మాత్రం అదంతా మర్చిపోయి తన బిజినెస్‌పై ఫోకస్ పెట్టాడు.

సురేశ్ రైనా ఒక మంచి ఫుడీ. వేర్వేరు రెస్టారెంట్లలో భోజనం చేయడం, కొత్త కొత్త వంటకాలను ట్రై చేయడం తనకు చాలా ఇష్టం. అందుకే తనకు నచ్చిన ఇండియన్ ఫుడ్‌ను యూరోప్ ప్రజలకు పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంటును ప్రారంభించనట్టుగా రైనా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చెప్పుకొచ్చాడు. ‘రైనా’ రెస్టారెంట్ గురించి పరిచయం చేస్తూ తన సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్‌ను షేర్ చేశాడు. అంతే కాకుండా ఆ సమయంలో తనకు రెస్టారెంటులో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నాడు.

రైనా ప్రారంభించిన ఈ కొత్త ప్రయాణంలో తనకు సక్సెస్ అందాలని సినీ ప్రముఖులు, క్రికెటర్లు విష్ చేశారు. చాలామంది ఈ రెస్టారెంట్ గురించి తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు కూడా. విరాట్ కోహ్లీ కూడా ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు వచ్చినప్పుడు కచ్చితంగా రెస్టారెంటుకు వస్తాను అని మాటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు. క్రికెట్ ద్వారా దూరమయినా కూడా తనకు నచ్చిన పని చేస్తూ రైనా హ్యాపీగానే ఉన్నాడు అనుకొని తన ఫ్యాన్స్ తృప్తి చెందుతున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×