BigTV English

Project-K : క్రేజీ అప్ డేట్.. ప్రాజెక్ట్‌-కెలో మరో స్టార్ హీరో..

Project-K : క్రేజీ అప్ డేట్.. ప్రాజెక్ట్‌-కెలో మరో స్టార్ హీరో..

Project-K : ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చిత్రం ప్రాజెక్ట్‌ – కె. నాగ్‌ అశ్విన్‌ డెరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ న్యూస్ వచ్చింది. ఈ భారీ మూవీలో మరో స్టార్‌ హీరో నటిస్తున్నాడు.


విలక్షణ నటుడు కమల్ కమల్‌ హాసన్‌ ప్రాజెక్ట్ -కె లో నటిస్తున్నాడని కొన్ని రోజులుగా సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనని తాజాగా మూవీ టీమ్‌ ప్రకటించింది. కమల్‌ హాసన్‌ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో ఓ ప్రత్యేక వీడియోను ప్రాజెక్ట్‌-కె బృందం రిలీజ్ చేసింది. ఈ మూవీలో కమల్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

ప్రాజెక్ట్ -కె లో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ , దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైంది. ప్రాజెక్ట్‌- కె అనేది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే. ఈ సినిమా టైటిల్ ను జులై 3న ప్రకటిస్తారని తెలుస్తోంది. అదేరోజు మోషన్‌ పోస్టర్‌ను అమెరికాలో ఆవిష్కరిస్తారని టాలీవుడ్ టాక్.


ప్రాజెక్టు -కె పై తాజాగా ప్రభాస్‌ స్పందించాడు. లెజెండరీ నటుడు కమల్‌ హాసన్‌ తో కలిసి పనిచేయడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. ఇది తన హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణంగా పేర్కొన్నాడు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×