E-Paper
Advertisement

ICC T20 : టాప్ ప్లేస్ మళ్లీ సూర్యకుమార్‌దే!

ICC T20 : టాప్ ప్లేస్ మళ్లీ సూర్యకుమార్‌దే!
Advertisement

ICC T20 : టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్… ICC T20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ఏకంగా 859 పాయింట్లతో T20ల్లో సూర్య నెంబర్ వన్ పొజిషన్ నిలబెట్టుకున్నాడు. అతనికి దరిదాపుల్లో మరే క్రికెటర్ కూడా లేడు. ఇప్పటిదాకా తొలి స్థానం కోసం అతనితో పోటి పడ్డ ఆటగాళ్లంతా… చాలా వెనుకబడిపోయారు. పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండోస్థానంలో ఉండగా… పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 778 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. తర్వాతి స్థానాల్లో డెవన్‌ కాన్వే, మార్ క్రమ్, డేవిడ్‌ మలాన్‌, రిలీ రోసో, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఆరోన్‌ ఫించ్‌, పాతుమ్‌ నిస్సాంక ఉన్నారు.

ఇక… ఇంగ్లండ్‌ బ్యాటర్‌ అలెక్స్‌ హేల్స్‌ T20 ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చాడు. ఏకంగా 22 స్థానాలు మెరుగుపరుచుకుని 12వ ర్యాంక్ సాధించాడు. T20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో 34వ స్థానం నుంచి 12వ స్థానానికి ఎగబాకాడు… హేల్స్. టీమిండియాతో జరిగిన సెమీఫైనల్లో అలెక్స్‌ హేల్స్‌ 47 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. అతని ధాటికి టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడి T20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. T20 వరల్డ్ కప్ లో 212 పరుగులు చేసిన హేల్స్… టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-10 ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

Advertisement

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో… లంక స్పిన్నర్‌ వనిందు హసరంగా 704 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అఫ్గాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు ఆదిల్‌ రషీద్‌, సామ్‌ కరన్‌లు ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చారు. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇండియాపైనా, ఫైనల్లో పాకిస్తాన్‌పైనా చెలరేగి బౌలింగ్ చేసిన రషీద్‌ ఐదు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా.. ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ రెండు స్థానాలు ఎగబాకి టాప్‌-5లో చోటు సాధించాడు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×