Big Stories

Cold Weather In AP And Telangana : తెలుగు రాష్ట్రాల్లో పంజా విసురుతున్న “చలిపులి”..

Cold Weather Cold Weather In AP And Telangana : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ప్రధాన నగరాలతో పాటు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. ఉదయం చలిగాలుల ప్రభావం పెరగడంతో ….చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులతో పాటు శ్వాసకోస సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పెద్దలు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ చలి ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పొద్దుపొద్దునే రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడుతోన్నారు. రోజురోజుకు రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. పలు జిల్లాల్లో ఇప్పుడే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి , ఆదిలాబాద్ జిల్లాల్లో చలి బీభత్సంగా కనిపిస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరిగింది.

- Advertisement -

మరోవైపులోనూ ఏపీలోనూ చలి పెరిగిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువుగా కనిపిస్తోంది. పాడేరులో 12, మినములూరులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయ. అరకులోయలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాబోయే నాలుగు రోజులు చలి మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News