BigTV English

T20 World Cup 2024 : టీ 20 వరల్డ్ కప్ కి.. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఫైనల్

T20 World Cup 2024 : టీ 20 వరల్డ్ కప్ కి..  కెప్టెన్ గా రోహిత్ శర్మ ఫైనల్
T20 World Cup 2024

T20 World Cup 2024 : 2024 టీ 20 వరల్డ్ కప్ కెప్టెన్ విషయమై అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రకటించడమే తరువాయి గా ఉంది. క్రికెట్ బోర్డు సభ్యులందరూ కూడా మెగా టోర్నమెంట్ కి రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండటమే సరైనదని ఒక నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయమైన సమాచారం. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తర్వాత ఇటీవల బోర్డు సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశానికి హెడ్ కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, బోర్డు కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్ సెల్లర్ సమావేశానికి హాజరయ్యారు.

ముఖ్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండాలని పట్టుపట్టినట్టు సమాచారం.ఈ క్రమంలో రోహిత్ శర్మ కూడా ఈ టోర్నీలో జట్టుకి నాయకత్వం వహించేది తానో , కాదో చెబితే, ఆ ప్రకారం సన్నద్ధమవుతానని అందరి ముందు అన్నట్టు  బోర్డు సభ్యుడు ఒకరు తెలిపారు.


తామింకా రోహిత్ శర్మ ఇంట్రస్ట్ గా లేడని భావిస్తున్నాం. తనంతట తనే చేస్తానని చెబుతున్న తర్వాత ఇంక ఆలోచించడానికి ఏముంది?  అని అందరూ రోహిత్ నే టీ 20 కెప్టెన్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇంక త్వరలోనే ప్రకటన రావచ్చునని అంటున్నారు.

దక్షిణాఫ్రికాలో కూడా జట్టుని నడిపించాలని కోరినా, తనకి విశ్రాంతి కావాలని కోరినట్టు సమాచారం. దీంతో అతని కోరికను మన్నించి టీ 20, వన్డేలకు తప్పించారు. కేవలం టెస్ట్ జట్టుకు మాత్రమే నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. రోహిత్ కాదనడంతో టీ 20 కి కెప్టెన్ గా సూర్యకుమార్ కి, వన్డే ల్లో కేఎల్ రాహుల్ కి అవకాశం దక్కింది.

2022 నుంచి ఇంతవరకు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ భారత్ తరఫున టీ 20 మ్యాచ్ లు ఆడలేదు. అయితేనేం ఐపీఎల్ లో ఇరగదీస్తున్నారు కదా, టీ 20ల్లో ఆడకపోయినా నష్టం లేదని పలువురు వ్యాక్యానిస్తున్నారు. అది మ్యాటరే కాదంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×