BigTV English

T20 World Cup 2024 : ఆఫ్గానిస్తాన్ టూర్ కి.. ఎవరెళుతున్నారు?

T20 World Cup 2024 : ఆఫ్గానిస్తాన్ టూర్ కి.. ఎవరెళుతున్నారు?

T20 World Cup 2024 : సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే అఫ్ఘానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో యువజట్టు తలపడనుంది. అయితే టెస్ట్ మ్యాచ్ లో ఆడిన సభ్యుల్లో కొందరు టీ 20లో ఆడతారా? లేదా? అనేది ఇంకా తెలీదు. కాకపోతే జనవరి 11న తొలి టీ 20, 14న రెండో టీ 20, 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. 2024లో జరిగే పొట్టి ప్రపంచకప్ ముందు జరిగే ఆఖరి సిరీస్ ఇదే అని చెప్పాలి. లేదంటే ఎంపిక బాధ్యతలను ఐపీఎల్ లోనే చూసుకోవాల్సి ఉంటుంది.


టీ 20 జట్టు కెప్టెన్ గా మొదట్లో హార్దిక్ పాండ్యాను ప్రకటించారు. కాకపోతే తను గాయంతో ఆటకు దూరమయ్యాడు. తాత్కాలిక కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కి బాధ్యతలు అప్పగించారు. తను ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ ను గెలిపించాడు. సౌతాఫ్రికాలో సమం చేశాడు. మొత్తానికి తనకి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. ఇప్పుడు తను కూడా గాయంతో జట్టుకి దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టీ 20 జట్టు కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మనే పిలుస్తారా? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అలా జరిగితే ఇంగ్లాండ్ తో జనవరి 25 నుంచి ప్రారంభమయ్య తొలి టెస్టుకు సమయం సరిపోదని అంటున్నారు.

ఎందుకంటే ఆఫ్గనిస్తాన్ లో ఆఖరి టీ20 జనవరి 17న అవుతుంది. వీరు 18న ఇండియాకు బయలుదేరి వస్తారు. ఇంక టెస్ట్ మ్యాచ్ కు 5రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఇంటికి వెళ్లే అవకాశమే ఉండదు. మళ్లీ టెస్ట్ మ్యాచ్ శిక్షణ శిబిరంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడితో కూడిన పర్యటనల వల్ల ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా అలసిపోతారని అంటున్నారు. డబ్బులకి ఆశపడి క్రికెట్ మ్యాచ్ లను పెంచేస్తున్నారనే విమర్శలు బీసీసీఐపై ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ వారు పట్టించుకోవడం లేదు.


కొందరు ఏమంటున్నారంటే టెస్ట్ మ్యాచ్ టీమ్ ని సరాసరి ఇండియాకి పంపించి, ఇంగ్లాండ్ తో సిరీస్ కి సిద్ధం చేస్తారు. ఇక కొత్త టీ 20 కెప్టెన్, టీమ్ తో ఆఫ్గానిస్తాన్ టూర్ కి గానీ పంపిస్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×