E-Paper
Advertisement

Karimnagar : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంజినీర్.. నాలుగేళ్లు జైలు శిక్ష

Karimnagar : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ ఇంజినీరుకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్‌ వివేక్‌ శుక్రవారం తీర్పు ప్రకటించారు.

Karimnagar : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇంజినీర్.. నాలుగేళ్లు జైలు శిక్ష
Advertisement
telangana news today

Karimnagar Latest news(Telangana news today):

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ ఇంజినీరుకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్‌ వివేక్‌ తీర్పు వెల్లడించారు.

గజానన ఆగ్రోమిల్స్‌ సంస్థకు పొల్యూషన్‌ లైసెన్స్‌ తీసుకునేందుకు సంస్థ ప్రతినిధి హరీష్‌కుమార్‌ 2010 జులై 17న నిజామాబాద్‌లోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకున్నాడు. పర్యావరణ ఇంజినీరు ముదావత్‌ చంద్రకాంత్‌ నాయక్‌ లైసెన్స్‌ మంజూరు చేయ్యడానికి రూ.75 వేల రూపాయలు లంచం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వలేనని హరీష్ కుమార్ వెళ్లిపోయారు. మరోసారి లైసెన్స్ మంజూరు కోసం అదే ఇంజినీరును సంప్రదించగా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

Advertisement

బాధితుడు అక్టోబరు 8న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డిని సంప్రదించారు. ఆయన సలహా మేరకు హరీష్‌కుమార్‌ ఇంజనీర్ కు రూ.25 వేలు తీసుకెళ్లి కార్యాలయంలో ఇంజనీర్ కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ, సీఐలు వెంకటేశ్వర్లు, సైదులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కిశోర్‌కుమార్‌ వాదనలు వినిపించారు. కేసుని విచారించిన న్యాయస్థానం నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన ఇంజనీర్ చంద్రకాంత్‌ నాయక్‌ ప్రస్తుతం సనత్ నగర్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×