BigTV English

Tiger Nageswara Rao : రవితేజ‌తో రామ్, విజ‌య్‌ ఢీ.. ర‌స‌వ‌త్త‌రంగా ద‌స‌రా పోరు

Tiger Nageswara Rao : రవితేజ‌తో రామ్, విజ‌య్‌ ఢీ.. ర‌స‌వ‌త్త‌రంగా ద‌స‌రా పోరు
Tiger Nageswara Rao

Tiger Nageswara Rao : మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఓ బ‌యోపిక్‌. 1970 ల నేపథ్యంలో స్టూవర్టుపురంలోని గజదొంగ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ఈ పవర్ ఫుల్ పాత్ర పోషించేందుకు రవితేజ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా సరికొత్త బాడీ లాంగ్వేజ్‌, యాసతో ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు.


కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌ బస్టర్ సినిమాలను అందించిన అభిషేక్ అగర్వాల్ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రాన్ని నిర్మిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 5 ఎకరాల స్థలంలో సినిమా కోసం స్టువర్టుపురం గ్రామాన్ని రిక్రియేట్ చేసి మ‌రీ చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 20న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అదే రోజున మ‌రో రెండు భారీ సినిమాలు పోటీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అవేవో కావు… కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన లియో. ఈ సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇది అక్టోబ‌ర్ 19న రిలీజ్ అవుతుంది.

అలాగే రానున్న ద‌స‌రా బ‌రిలోకి దిగుతున్న మ‌రో క్రేజీ మూవీ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా. ఇది అక్టోబ‌ర్ 20న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మ‌రి ఈ మూడు చిత్రాల్లో ద‌స‌రా విజేత‌గా ఎవ‌రు నిలుస్తారో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×