Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఐపీఎల్ లో జరిగే మ్యాచ్ లు అన్నీ కూడా ఫిక్సింగ్ అని ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) సంచలన ప్రకటన చేశారు. ఐసీసీ చైర్మన్ పదవి ( icc chairman) తనకు ఇచ్చేందుకు జై షా ( jay shah) సిద్ధమయ్యాడని బాంబు పేల్చారు. దీని కోసం ఫోన్ చేసి మరీ.. తనను వేధిస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఐసీసీ చైర్మన్ పదవి తీసుకోవాలని తన కాళ్లు కూడా జై షా మొక్కాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగుతున్న జై షా ( jay shah).. ఆ పదవిలో 2027 వరకు కొనసాగుతారు. డిసెంబర్ ఒకటో తేదీ 2024 లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు జై షా. దాదాపు 108 సభ్య దేశాలు ఓటింగ్ లో పాల్గొనగా ఐసీసీ చైర్మన్ పదవి జై షాకు దక్కింది. వాస్తవంగా ఐసీసీ చైర్మన్ పదవి కాలం మొదట్లో రెండు సంవత్సరాలు మాత్రమే ఉండేది. కానీ జై షా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు పెంచారు. ఈ లెక్కన డిసెంబర్ నెల 2027 వరకు ఐసీసీ చైర్మన్ గా జై షా ( jay shah) కొనసాగుతాడు అన్నమాట. 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తి అయ్యేవరకు ఐసీసీ బాస్ గా జై షానే ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో జై షా స్థానంలో మొహ్సీన్ నఖ్వీకి ఐసీసీ ఛైర్మన్ పదవి వరిస్తుందని ప్రచారం జోరుగా సాగుతోంది. 2027 వరకు ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఐసీసీ చైర్మన్ గా జై షా ఉన్న నేపథ్యంలో అతనిపైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టాలని తనను పదే పదే హింసిస్తున్నాడని జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశారు తన్వీర్ అహ్మద్. ఈ పదవి చేపట్టాలని తన కాళ్లు కూడా మొక్కాడని.. బాంబు పేల్చారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు.
https://www.facebook.com/photo/?fbid=966658469608229&set=a.808612632079481