బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పాకిస్తాన్ క్రికెట్ ను స‌ర్వ‌నాశ‌నం చేశారు..గంభీర్ లాంటి కోచ్ మాకు కావాలి

పాకిస్తాన్ క్రికెట్ ను స‌ర్వ‌నాశ‌నం చేశారు..గంభీర్ లాంటి కోచ్ మాకు కావాలి

Tanveer Ahmed:  ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Asian Games tournament) కోసం తాజాగా పాకిస్తాన్ జట్టును ప్రకటించింది PCB. ఈ సందర్భంగా సీనియర్ ప్లేయర్లు అంద‌రినీ పక్కకు పెట్టి… కొత్త వాళ్లకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఫర్హాన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ అఫ్రిది లాంటి సీనియర్లపై వేటు వేశారు. అయితే ఈ జట్టును ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) తన స్టైల్ లో సీరియస్ అయ్యారు. ఎవడిని అడిగి ఈ జట్టును ప్రకటించారని.. వీళ్లతోనా మీరు గెలిచేది? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తన్వీర్ అహ్మద్. ఫర్హాన్ దూకుడుగా ఆడతాడని.. అలాంటోడికి కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే, పాకిస్తాన్ దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ, కోచ్ లపై తన్వీర్ అహ్మద్ సీరియస్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన సెలెక్టర్లు, కోచ్ లు పెద్ద దద్దమ్మలంటూ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) ఫైర్ అయ్యారు. అలాంటి వాళ్లతో పాకిస్తాన్ గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు. ఏషియన్ గేమ్స్ (2026 Asian Games tournament) కోసం తాజాగా జట్టును ప్రకటిస్తే… అందులో అసలు సిసలైన ఆటగాళ్లు లేరని మండిపడ్డారు. అయినా ఈ జట్టును ప్రకటించేటప్పుడు తమ లాంటి సీనియర్లను సంప్రదిస్తే బాగుందని మండిపడ్డారు. ఎవడిని అడిగి వాళ్లను సెలెక్ట్ చేశారని ప్రశ్నించారు. ఇక సర్ఫరాజ్ నిలదీశారు. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం అతడేనంటూ ఆగ్రహించారు.

అసద్ షఫీక్ జట్టుకు ఎలాంటి సేవలు అందిస్తున్నాడని… నాలుగు జాబులు ఇచ్చారు అంటూ మండిపడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ సర్వనాశనం కావడానికి అకీబ్ జావీద్ ముఖ్య కారణమంటూ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇప్పటికైనా తన మాట విని.. గౌతమ్ గంభీర్ లాంటి విదేశీ హెడ్ కోచ్ ను నియామకం చేసుకోవాలని సూచనలు చేశారు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ ప్రమాదంలో పడుతుందని వార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed).

గంభీర్ లాంటి కోచ్ మాకు కావాలి

టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయాయని గుర్తు చేశారు తన్వీర్ అహ్మద్. వరుసగా వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి విజయాలను టీమిండియా నమోదు చేసుకున్నట్లు గుర్తు చేశారు తన్వీర్ అహ్మద్. అందుకే గౌతమ్ గంభీర్ లాంటి మొనగాడిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెతకాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో తన్వీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

 

Related News

అల్లా మీద ఒట్టు..నా కెప్టెన్సీలో పాకిస్తాన్ కు 3 వ‌ర‌ల్డ్ క‌ప్ లు తీసుకొస్తా

Fact Check: షోయ‌బ్ అక్త‌ర్ 23 ఏళ్ల రికార్డ్ బ‌ద్ద‌లు..162 స్పీడ్ తో నహిద్ రాణా బౌలింగ్

ఉగాండా కంటే దారుణంగా మారిన‌ ఆస్ట్రేలియా, మొన్న పాక్‌, ఇప్పుడు బంగ్లా చేతిలో చిత్తు

నేనే ఐసీసీ ఛైర్మ‌న్ అవుతా..ఇండియ‌న్స్ కూడా PSL ఆడేలా రూల్స్ పెడ‌తా

Mohammad Amir: మ‌రో 40 ఏళ్లు అయినా ఐపీఎల్ ను PSL ట‌చ్ చేయ‌లేదు

భారతి ఫుల్మాలికి ఘోర అవ‌మానం..పాక్‌ క్రికెట‌ర్లకు సెక్యూరిటీ పెంచాలంటూ డిమాండ్స్‌

Wasim Akram: ప్ర‌పంచ బ్యాట‌ర్లంద‌రూ నహిద్ రాణాను త‌ల‌చుకుని భ‌య‌ప‌డుతున్నారు

×