Vaibhav – Kohli: టీమిడియా వర్సెస్ జింబాబ్వే టి20 సిరీస్ (Team India vs. Zimbabwe T20 Series) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ వివాదంలో చిక్కుకున్నాడు. బౌండరీ గేట్ దగ్గర నిలబడ్డ వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi)… ప్రత్యేకంగా ఓ కూల్ డ్రింక్ తెప్పించుకున్నాడు. ఈ క్రమంలోనే నోట్లో కూల్ డ్రింక్ ( Virat Kohli drinks black water) పోసుకొని.. స్టేడియంలోనే ఉమ్మేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు (Virat Kohli) సీరియస్ అవుతున్నారు. మా విరాట్ కోహ్లీ ఎంతో ఇష్టంగా తాగే కూల్ డ్రింక్ ను వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఉమ్మేశాడని ఆగ్రహిస్తున్నారు. వైభవ్ వల్ల, బీసీసీఐకి (BCCI) కోట్లల్లో నష్టం జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య ఇటీవల 3 టీ20ల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా.. జింబాబ్వేను వైట్ వాష్ చేసింది. 3-0 తేడాతో జింబాబ్వే జట్టును చిత్తు చేసింది టీమిండియా. అయితే ఈ సిరీస్ లో భాగంగా మూడవ మ్యాచ్ సందర్భంగా ఆ బౌండరీ గేటు దగ్గర వైభవ్ సూర్య వంశీ ఫీల్డింగ్ చేశాడు. అయితే ఫీల్డింగ్ చేస్తూ అలసిపోయిన వైభవ్… వాటర్ బాయ్ ద్వారా కూల్ డ్రింక్ తప్పించుకున్నాడు.
అయితే ఆ కూల్ డ్రింక్ తాగకుండా… నోట్లో పోసుకొని ఉమ్మేసాడు వైభవ్. దీనిపై విరాట్ కోహ్లీ అభిమానులు సీరియస్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ను వైభవ్ ఉమ్మేసాడని ఫైర్ అవుతున్నారు. శరీరానికి ఎంతో ఉపయోగకరమైన ఈ ఆల్కలైన్ వాటర్ ను ఎలా ఉమ్మేస్తాడని నిలదీస్తున్నారు. దీనివల్ల బీసీసీఐకి కోట్లలో నష్టం జరుగుతుందని వెల్లడిస్తున్నారు. విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్ వాడే బ్లాక్ వాటర్ ను ఇలా ఉమ్మేస్తే ? వాళ్ళ బ్రాండ్ కూడా పడిపోతుందని ఫైర్ అవుతున్నారు.
విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ని వైభవ్ సూర్యవంశీ ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నాడు. అతడి లాగానే బ్లాక్ వాటర్ తాగి ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటున్నాడు వైభవ్. లేటెస్ట్ గా ఆ వాటర్ ను ఉమ్మేసి వివాదంలో చిక్కుకున్నాడు. వాస్తవానికి ఈ వాటర్ లీటర్ బాటిల్ ధర రూ.4000 ఉంటుంది. ఒక మ్యాచ్ సందర్భంగా ఒక్కో ప్లేయర్ ఈ వాటర్ బాటిల్స్ ను దాదాపు 10 నుంచి 20 తాగుతాడు.
వీటిని కోట్లు ఖర్చుపెట్టి మరి కొనుగోలు చేస్తుంది బీసీసీఐ. సాధారణ నీటితో పోలిస్తే ఈ బ్లాక్ వాటర్ లో PH స్థాయి ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని ఎక్కువసేపు హైడ్రేట్ ఉంచడంలో ఇది సహాయపడుతుంది. స్కిన్ ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఈ బ్లాక్ వాటర్ తాగుతారు. అలాంటి వాటర్ ను ఉమ్మేయడంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
Amiri Dekh Rahe Ho Bhai Ka? 😂
People say, "OMG! Virat Kohli drinks black water."
But look at Vaibhav Sooryavanshi—he's using black water just to rinse his mouth. 😅
The result? A direct-hit at the stumps. 🔥 pic.twitter.com/N4x7q6WgUu
— Jara (@JARA_Memer) July 28, 2026