Babar Azam Condition For Pakistan Captaincy: పాకిస్తాన్ క్రికెట్ జట్టులో (Pakistan cricket team) కీలక మార్పులు జరుగుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ (2027 ODI World Cup tournament) కోసం సిద్ధమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… టైటిల్ గెలిచే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనికోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇక లేటెస్ట్ గా బాబర్ ఆజంకు (Babar Azam) పిలిచి మరి టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయితే రెండు సంవత్సరాల తర్వాత టెస్ట్ కెప్టెన్సీ దక్కించుకున్న బాబర్ ఆజం, మొహ్సిన్ నఖ్వీకి ఝలక్ ఇచ్చాడట. టెస్ట్ కెప్టెన్సీ తీసుకునే ముందు ఒక కండీషన్ పెట్టినట్లు నేషనల్ మీడియాలో పెద్దనాలు వస్తున్నాయి. టెస్ట్ కెప్టెన్సీ తో పాటు మిగిలిన రెండు ఫార్మాట్స్ కెప్టెన్సీ (Pakistan Captaincy) అప్పగించాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అలా అయితేనే టెస్ట్ కెప్టెన్సీ తీసుకుంటానని బాబర్ ఆజం భీష్మించుకొని కూర్చున్నాడట. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్ గా బాబర్ ఆజం (Babar Azam) బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బాబర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే అంతకు ముందు టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించిన షాన్ మసూద్ విఫలమయ్యాడు. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో… షాన్ మసూద్ పైన వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే బాబర్ ఆజంకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. అయితే ఈ టెస్ట్ కెప్టెన్సీ తీసుకునే ముందు… బాబర్ లిటిగేషన్ పెట్టాడు. టెస్ట్ కెప్టెన్సీ కాకుండా… మిగిలిన వన్డే, టి20లో కూడా తననే కెప్టెన్ చేయాలని కండిషన్ పెట్టాడు. ఇక చేసేదేమీ లేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా దిగివచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కథనాలు వైరల్ అవుతున్నాయి.
బాబర్ ఆజం పెట్టిన కండిషన్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన అధికారులు స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ అలాగే త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టుల్లో పాకిస్తాన్ మెరుగ్గా రాణిస్తే.. బాబర్ కండీషన్ ను పరిశీలిస్తామని వెల్లడించారు. టెస్టుల్లో అద్భుతంగా రానిస్తే ఖచ్చితంగా వన్డే తో పాటు టి20 కెప్టెన్సీ అప్పగిస్తామని వివరించారు. అంతకు ముందు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాలని సల్మాన్ ఆఘాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఇక వేరే గత్యంతరం లేక బాబర్ ఆజంకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇది అదునుగా చేసుకొని… మూడు ఫార్మాట్స్ కెప్టెన్సీ ఇవ్వాలని షరతు పెట్టాడు బాబర్.