E-Paper
Advertisement

ఆడాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు.. వీడియోతో వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’!

ఆడాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు.. వీడియోతో వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’!
Advertisement

Adarsha kutumbam:గురూజీ త్రివిక్రమ్ (Trivikram)దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh ) హీరోగా , శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్ గా, నారా రోహిత్ (Nara Rohit) పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం.. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది .ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి.. చిత్ర బృందం ఒక్కొక్కటిగా అప్డేట్స్ పంచుకుంటోంది. ఈ క్రమంలోనే ఆదర్శ కుటుంబం ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యింది. ఈ మేరకు జూలై 27వ తేదీన ఒక స్పెషల్ అప్డేట్ ను పంచుకుంది. అందులో వెంకటేష్ చిట్టిబాబు పాత్ర పోషిస్తున్నట్టు , ఇద్దరు బిడ్డల తండ్రిగా డైరెక్టర్ త్రివిక్రమ్ పరిచయం చేశారు.

మరోసారి నవ్వులు పూయిస్తున్న వెంకటేష్..

జూలై 28న శ్రీనిధి శెట్టి స్వర్ణ పాత్రలో నటిస్తున్నట్లు ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేస్తూనే.. వెంకటేష్ లోని మరో యాంగిల్ ను ఆడియన్స్ కి పరిచయం చేశారు. ఫ్రస్టేషన్ కం రొమాంటిక్ యాంగిల్ లో.. మరోవైపు తన కామెడీ టైమింగ్ తో వెంకటేష్ అదరగొట్టేశారు. తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో కమెడియన్ రఘుబాబుతో వెంకటేష్ ఫ్రస్టేషన్లో మాట్లాడుతూ..”ఈ ఆడాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు.. ఆడదంటే కనపడగానే పువ్వులాగ నవ్వాలి.. నా భార్యా ఉంది. ఎప్పుడూ మూతి ముడుచుకొని ఉంటుంది. ఎప్పుడో పెళ్లయిన కొత్తలో పెళ్లి ఫోటో కోసం మాత్రమే నవ్వింది” అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ చేత నవ్వులు పూయిస్తోంది. పైగా కమెడియన్ సత్య కూడా ఇందులో నటిస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. మొత్తానికైతే మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు వెంకటేష్. దీంతో థియేటర్లలో నవ్వులు పూయడం గ్యారెంటీ అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత మొత్తం ‘మా’దే -కరాటే కళ్యాణి

కుటుంబ అంశాలతో ముడిపడిన యాక్షన్ ఎంటర్టైనర్..

ఈ సినిమా విషయానికి వస్తే.. చిట్టి బాబుగా వెంకటేష్, స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి , సంపూర్ణ పాత్రలో యువినా పార్వతి, శర్వాగా రాజ్ ప్రజ్వల్ నటిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ అధికారికంగా స్పష్టం చేశారు . కుటుంబ అంశాలతో ముడిపడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా కూడా దీనిని తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి వెంకటేష్ సినిమాలకు స్క్రిప్ట్ అందించిన త్రివిక్రమ్.. ఇప్పుడు ఏకంగా ఆదర్శ కుటుంబం సినిమాతో తొలిసారి వెంకటేష్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే ఇందులో వెంకటేష్ మధ్యతరగతి కుటుంబం పెద్దగా నటిస్తున్నారు.

Advertisement

Related News

పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత మొత్తం ‘మా’దే -కరాటే కళ్యాణి

పేరు మార్చుకున్న పవన్ కళ్యాణ్ భార్య!

ఏంటీ.. శ్రీనిధి శెట్టి వెంకటేష్ కి కూతురుగా నటిస్తోందా?

హీరోయిన్ హెబ్బా పటేల్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత…

హీరోయిన్లకు ఉన్న ఈ వింత అలవాట్లు తెలిస్తే షాక్ అవుతారు!

సినిమా పైరసీకి కేంద్రం షాక్.. వేల వెబ్‌సైట్లు బ్లాక్!

Big Stories

Advertisement
×