E-Paper
Advertisement

అజిత్ అగార్క‌ర్ పంపించిన సీనియ‌ర్లు…రంగంలోకి గంభీర్ రంకు మొగుడు!

అజిత్ అగార్క‌ర్ పంపించిన సీనియ‌ర్లు…రంగంలోకి గంభీర్ రంకు మొగుడు!
Advertisement

Ms Dhoni replace Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్…పదవికి ఎండ్ కార్డ్ పడ్డట్టే కనిపిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఫినిష్ కాకముందే, అజిత్ అగార్కర్ ను దించే పనిలో బీసీసీఐ పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అక్టోబర్ 4వ తేదీతో అజిత్ అగార్కర్ పదవి కాలం ముగియనుంది. మరో నాలుగు రోజుల్లో బీసీసీఐ ఉన్నతస్థాయి సమావేశం కూడా జరుగనుంది. ఈ సమావేశంలోనే అజిత్ అగార్కర్ భవితవ్యం ఏంటి అనేది తేలనుంది. లార్డ్స్ వేదికగానే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు గత నెలలో లీకులు ఇచ్చింది అజిత్ అగార్కరే అని గ్రహించిన బీసీసీఐ, ఈ మేరకు చర్యలకు దిగినట్లు చెబుతున్నారు. అంతకు ముందు అజిత్ అగార్కర్ పదవీ కాలం పొడగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. 2027 వన్డే వర్డల్ కప్ పూర్తయ్యే వరకు గంభీర్ తో పాటు అజిత్ అగార్కర్ కొనసాగుతాడనే ప్రచారం సాగింది. కానీ ఎప్పుడైతే, రోహిత్ శర్మ జోలికి వచ్చాడో, అప్పుడే అజిత్ అగార్కర్ పదవికి ఎండ్ కార్డ్ పడినట్లు చర్చ మొదలైంది. దానికి తగ్గట్టుగానే, అజిత్ అగార్కర్ ను దించేలా బీసీసీఐ కసరత్తులు మొదలెట్టినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

అజిత్ అగార్కర్ ను అందుకే దించేస్తున్నారా ?

అజిత్ అగార్కర్ పదవిని పొడగించకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో బీసీసీఐ పెద్దలు కసరత్తులు మొదలు పెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే టీమిండియా మాజీల పేర్లు పరిశీలిస్తున్నారట. అయితే, అజిత్ అగార్కర్ ను ఉన్న ఫలంగా తీసేయడానికి సవాలక్ష‌ కారణాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 2024 లో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ గా బాధ్యతలు తీసుకున్న అజిత్ అగార్కర్, తన పీరియడ్ లో చాలా మంది క్రికెటర్లను తొక్కేశారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ లాంటి వాళ్లను అస్సలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడు. దేశవాళీ, ఐపీఎల్ లో ఇరగదీస్తున్న ఈ ఇద్దరినీ అసలు తీసుకోలేదు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో… వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కూడా ఈ ఇద్దరినీ పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలో అజిత్ అగార్కర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని ప్రచారం కూడా ఉంది. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా తమ పరిగణలో అసలు లేరని గతంలో ప్రకటించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్లు అందరూ కూడా అజిత్ అగార్కర్ పై… బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ముఖ్యంగా లార్డ్స్ లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నట్లు లీకులు కూడా ఇచ్చాడట. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ, అతడిని తొలగించేందుకు సిద్ధమైందట.

అజిత్ అగార్కర్ ఔట్..తెరపైకి ఆ ముగ్గురు పేర్లు ?

Advertisement

అజిత్ అగర్కర్ పదవి పొడగించకపోతే… పరిస్థితి ఏంటని ఇప్పుడు సరికొత్త చర్చ జరుగుతోంది. అజిత్ అగార్కర్ స్థానంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే దానిపైన బీసీసీఐ కసరత్తులు మొదలు పెట్టింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రజ్ఞా ఇప్పటికే భారత సెలక్షన్ కమిటీలో మెంబర్ గా ఉన్నాడు. అతనికి మళ్లీ చీఫ్ సెలెక్టర్‌ గా ఛాన్స్ ఇవ్వకపోవచ్చే వాదన ఉంది. ఇక ఇటు పార్థివ్ పటేల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అతనికి అపారమైన అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ లాంటి జట్టుకు కోచ్ గా చేసిన అనుభవం ఉంది. అయితే, ఇద్దరి కంటే, ధోని పేరు బాగా వినిపిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న తరుణంలో ధోనిని చీఫ్ సెలక్టర్ చేస్తే బాగుంటుందని మాజీలు కూడా కోరుతున్నారు. 2007, 2011 వరల్డ్ కప్ లతో పాటు 2013 ఛాంపియన్ తెచ్చిన ధీరుడు ధోని. 2027 లో వరల్డ్ కప్ గెలవాలంటే,ధోనినే దించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురిలో బీసీసీఐ ఎవరిని ఫైనల్ చేస్తుందో చూడాలి.

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

Related News

30 బంతుల్లో అభిషేక్ సెంచ‌రీ, రోహిత్ రికార్డ్ బ‌ద్ద‌లు…స్లోగా బౌలింగ్ చేశారంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం !

కొంపముంచిన స్మృతి వ్యవహారం.. పృథ్వీ షాతో కాబోయే భార్య బ్రేకప్

జై షాకు ఒళ్లంతా పొగరే…సెక్యూరిటీ కోసం ఆఫ్ఘానిస్తాన్ అధికారినే కూర్చిలోంచి లేపాడంటూ!

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు

రోహిత్,కోహ్లీ లేకపోతే..మ్యాచ్ లో కిక్కే లేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సంచలనం

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !

Big Stories

Advertisement
×