Prithvi Shaw – Akriti Agarwal: టీమిండియాలో ఛాన్సుల కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తోన్న పృథ్వీ షా మరో ఊహించని షాక్ తగిలింది. తనకు కాబోయే భార్యకు కూడా పృథ్వీ షాకు హ్యాండ్ ఇచ్చింది. స్మృతి మందాన తరహాలోనే పృథ్వీ షా పెళ్లి కూడా పీటల దాకా వచ్చి, క్యాన్సిల్ అయింది. ఆరు నెలల కిందట ఎంగేజ్మెంట్ చేసుకున్న పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఇద్దరూ విడిపోయారు. పరస్పర ఒప్పందం ప్రకారమే విడిపోయినట్లు తాజాగా ఆకృతి అగర్వాల్ తాజాగా ప్రకటిస్తూ, ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా, అతనికి కాబోయే భార్య, ప్రముఖ నటి ఆకృతి అగర్వాల్ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరుగగా, పరస్పర ఒప్పందం ప్రకారం విడిపోతున్నట్లు వెల్లడించారు.ఈ ఏడాది మార్చి 8వ తేదీన ఢిల్లీలోనే చాలా గ్రాండ్ గా పృథ్వీ షా, ప్రముఖ నటి ఆకృతి అగర్వాల్ ల నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ జరిగి, ఆరు నెలలు కాలేదు.. ఇంతలోనే అందరికీ షాక్ ఇస్తూ విడిపోయారు. ప్రముఖ నటి ఆకృతి అగర్వాల్ పోస్ట్ ప్రకారం.. ఇద్దరి లక్ష్యాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయని అందుకే విడిపోతున్నట్లు వెల్లడిచింది. అంతేకానీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరుగలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైతే చేసింది.
కానీ గతంలో పృథ్వీ షా గురించి మరోలా పోస్ట్ పెట్టారు ఆకృతి. తనను పృథ్వీ షా మోసం చేశాడని, సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం నిజమేనని ఆమె వెల్లడించారు. వాడుకుని వదిలేసే కుట్రలు జరుగుతున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు. కానీ పోస్ట్ చేసిన వారం రోజులకే, పృథ్వీ షా మంచోడని ప్లేట్ పిరాయించింది. పృథ్వీ షా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయింది. ఇక ఇవాళ, పృథ్వీ షాకు బ్రేకప్ చెబుతూ మరో పోస్ట్ చేసింది. దీంతో పృథ్వీ షా, ఆకృతి మధ్య స్మృతి మందాన తరహాలోనే ఏదో షాకింగ్ సంఘటన చోటు చేసుకున్నట్లు చర్చ మొదలైంది. మరో అమ్మాయితో రెడ్ హ్యాండెండ్ గా దొరికినట్లుగా కూడా ప్రచారం మొదలైంది.
పృథ్వీ షా, ప్రముఖ నటి ఆకృతి అగర్వాల్ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్న ఈ తరుణంలో ఆసక్తికర చర్చ మొదలైంది. టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా పలు సార్లు పీకలదాకా తాగి గొడవలకు దిగాడు. రోడ్ల పైన రచ్చ రచ్చ చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడిని బీసీసీఐ పెద్దలు పక్కకు పెట్టారు అనే వార్త కూడా బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలో పెళ్లి కాబోతున్న విషయాన్ని మర్చిపోయి… మరో అమ్మాయితో పృథ్వీ షా తిరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. మరో అమ్మాయితో ఓ బెడ్ రూమ్ లో అడ్డంగా ప్రకటించే దొరికాడని అంటున్నారు. అందుకే ఉన్నఫలంగా పృథ్వీ షాకు ఆకృతి బ్రేకప్ చెప్పినట్లు చర్చ మొదలైంది. స్మృతి మందాన విషయంలో కూడా ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే.
మరో గంటలో పెళ్లి అనగా.. స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ పెళ్లి ఆగిపోయింది. అప్పుడు కూడా పలాష్ ముచ్చల్ మరో అమ్మాయితో బెడ్ రూంలోనే దొరికాడంటూ ప్రచారం జోరుగా సాగింది. ఇక ఇప్పుడు పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ ఇద్దరి మధ్య ఇలాంటి సంఘటనే చోటు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. పలాష్ లాగే, పృథ్వీ చేశారని ప్రచారం మొదలైంది. మరి ఇందులో ఎంతమేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, బ్రేకప్ గురించి..నటి ఆకృతి అగర్వాల్ పోస్ట్ పెట్టగానే వెంటనే పృథ్వీ షా కూడా రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియాలో ఆకృతికి సంబంధించిన ఫోటోలు మొత్తం డిలీట్ చేసేశాడు.