E-Paper
Advertisement

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు

టీమిండియాతో టీ20 సిరీస్…ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోట్ల‌ల్లో లాభాలు
Advertisement

IND VS AFG: టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య ప్రస్తుతం మూడు టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. రెండింటిలో టీమ్ ఇండియా విజయం సాధించి టైటిల్ కూడా గెలుచుకుంది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చిట్టచివరి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో, ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి వైట్ వాష్ చేసే దిశగా అడుగులు వేస్తోంది టీం ఇండియా. అటు ఒక్క మ్యాచ్ అయిన గెలిచి, పరువు కాపాడుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ట్రై చేస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు 50 కోట్ల ఆదాయం

టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న మూడు టి20 సిరీస్ నేపథ్యంలో బీసీసీఐకి ఒక్క రూపాయి రాలేదు. కానీ ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఈ సిరీస్ కారణంగా లాభపడింది. ఈ సిరీస్ కోల్పోయినప్పటికీ కూడా, దాదాపు 50 కోట్ల ఆదాయం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు జేబులో పడింది. దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా టీ20 సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిచ్చింది. ఇండియాలో ఈ సిరీస్ జరిగినప్పటికీ.. ఆతిథ్య జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఇలాంటి క్రమంలో ఈ సిరీస్ ద్వారా వచ్చిన డబ్బులు అన్ని ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు దక్కనున్నాయి. దాదాపు 50 కోట్ల రూపాయలు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ డబ్బుతో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు… తమ దేశంలో మైదానాలను రిపేర్ చేయించుకోబోతోంది. అలాగే తమ జట్టుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకోనుంది.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

ప్రసార హక్కుల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కు డబ్బులు

టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ ప్రసార హక్కులను సోని స్పోర్ట్స్ అలాగే ఫ్యాన్ కోడ్ దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలో ఈ ప్రసార హక్కులకు సంబంధించిన డబ్బులను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు కట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క రూపాయి కూడా బీసీసీఐకి దక్కబోవు అన్నమాట. ఈ క్రమంలో టీమిండియా కు ట్రోఫీ తప్ప రూపాయి మిగలలేదని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

Related News

హ‌ర్బ‌జ‌న్ దేవుడు సామీ..భార‌త స‌ర్కార్ కు తెలియ‌కుండా నా కుటుంబానికి టికెట్లు ఇప్పించాడు!

రోహిత్,కోహ్లీ లేకపోతే..మ్యాచ్ లో కిక్కే లేదు..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ సంచలనం

పాకిస్తాన్ దూల తీర్చిన ఇషాన్ కిషన్…రజావుల్లాను ఇమిటేట్ చేస్తూ !

ట్రోఫీ విషయంలో పాకిస్తానే కరెక్ట్..BCCIపై విషం కక్కిన ఇండియన్ జర్నలిస్ట్ !

ఒరేయ్ నఖ్వీ…ట్రోఫీలు కాదు, దమ్ముంటే అభిషేక్ శర్మ బ్యాట్లు దొంగతనం చెయ్

విండీస్‌తో సిరీస్‌లు..హార్దిక్, పంత్ కు నిరాశ, టీమిండియా జట్ల ప్రకటన..షెడ్యూల్ ఇదే

సంజు బ్యాట్ లో చిప్స్ పెట్టారు..అందుకే ఆఫ్గనిస్తాన్ పై ఊచకోత కోశాడు

Big Stories

Advertisement
×