ICC Rankings (cricket news today Telugu) : టీమ్ ఇండియా అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ గా కీర్తిశిఖరాలను అధిరోహించింది. వన్డే, టెస్ట్, టీ 20 ఇలా అన్ని ఫార్మాట్లలో టీమ్ ఇండియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏమిటిది కలయా, నిజమా అనుకుంటున్నారా? అక్షరాల నిజం..
వన్డే వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ లకు 8 నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది టీమ్ ఇండియా. అలాగే ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇప్పుడు అన్ని విభాగాల్లో మన ఆటగాళ్లు నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. ఇది నిజంగా భారతదేశానికెంతో గర్వకారణం. ప్రస్తుతం టీమ్ ఇండియా అభినందనల పరంపరలో తడిసి ముద్దవుతోంది.
వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో శుభ్ మన్ గిల్, బౌలింగ్ విభాగంలో సిరాజ్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నారు. ఇప్పుడు టీ20 ల్లో నెంబర్ వన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉంటే, ఆల్ రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా నెంబర్ వన్ గా నిలిచాడు. ఇక టెస్టుల్లో అయితే అశ్విన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
చూశారు కదండీ..ఆల్ మోస్ట్ అన్ని విభాగాల్లో మనవాళ్లే నెంబర్ వన్ గా ఉండటం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక రికార్డేనని అంటున్నారు.ప్రపంచంలో ఏ జట్టు కూడా వన్డే, టీ 20, టెస్ట్ లు ఇలా అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ గా ఉండటం అరుదైన విషయమని అంటున్నారు.
ఇప్పటికే ఆకాశమంత ఎత్తులో ఉన్న ఇండియన్స్ కి, ఈ నెంబర్ వన్ ర్యాంకులు తోడయ్యాయి. అందువల్ల కొద్దిగా మనోళ్లు ఇవన్నీ తలకెక్కించుకోకుండా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే ఆడిన అన్ని మ్యాచుల్లో ఓటమన్నదే ఎరుగకుండా వెళుతున్నారు. కాబట్టి ఎక్కడో దగ్గర పట్టుతప్పే అవకాశం ఉంది. అది నాకౌట్ మ్యాచ్ ల్లో కాకూడదని అంటున్నారు. ఇప్పటివరకు అందరూ మాక్జిమమ్ ఆడుతున్నారు. అందుకని చివర్లో వీళ్లు అలసిపోకూడదని అభిమానులు కోరుతున్నారు.
ఒకవైపు ఆస్ట్రేలియాను చూశారు కదా..ఎంత విధ్వంసకరంగా ఆడుతున్నారో, మరోవైపు సౌతాఫ్రికాను తక్కువ అంచనా వేయడానికి లేదంటున్నారు. ఇక నాలుగో జట్టుగా పాకిస్తాన్ వస్తుందా? న్యూజిలాండ్ వస్తుందా? తెలీదు. ఏది వచ్చినా సెమీఫైనల్, ఫైనల్ రెండు కూడా ఇవన్నీ తలకెక్కించుకోకుండా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన సీనియర్లు హెచ్చరిస్తున్నారు.