Big Stories

Swap Party : పార్టీలో గట్టిగా డీజే.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు.. అక్కడ జరిగేది మీరు ఊహించలేరు

Swap Party : చెన్నైలోని ఒక రిసార్ట్‌లో ఓ పార్టీ మొదలైంది. జోరుగా డీజే సౌండ్ వల్ల ఇబ్బందితో కొందరు స్థానికులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఏం జరుగుతోందని ప్రశ్నించగా.. అక్కడేదో రేవ్ పార్టీ జరుగుతోందని ముందు అనుకున్నారు. కానీ పార్టీలో వచ్చిన వారంతా దంపతులు లేదా ప్రేమికులు. వారందరినీ విడి విడిగా విచారణ చేస్తే.. షాకింగ్ నిజం బయటపడింది. అది రేవ్ పార్టీ కాదు స్వాప్ పార్టీ.

- Advertisement -

స్వాప్ పార్టీ అనేది ఒక నీచ సంస్కృతి. పాశ్చాత్య దేశాలలో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇటీవల ఈ స్వాప్ పార్టీ కల్చర్ భారతదేశంలోనూ మొదలైంది. యువత ఎంజాయిమెంట్ పేరుతో ఈ వింత పోకడలకు పోతున్నారు. స్వాప్ పార్టీ అసలు ఏంటి అనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు.

- Advertisement -

స్వాప్ పార్టీ అంటే పరిచయం ఉన్న స్నేహితులు తమ భార్యలతో పార్టీకి వస్తారు. అక్కడ ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు. ఒక ఆ రాత్రి వారితో కలిసి ఎంజాయ్ చేస్తారు. వినడానికే ఇది చాలా నీచంగా ఉన్నా.. మెట్రోపాలిటన్ సిటీలలో గత కొన్నేళ్లుగా ఈ కల్చర్ వ్యాపిస్తోంది. చాలా సందర్భాల్లో మహిళలు, పురుషులు ఇద్దరి అంగీకారంతో ఇవి జరిగినా. కొన్ని సార్లు మాత్రం మహిళలకు ఇష్టం లేకుండా బలవంతంగా జరుగుతన్నాయని తెలిసింది.

స్వాప్ పార్టీలను కూడా కొందరు బిజినెస్‌గా మార్చుకున్నారు. ఇటీవల స్వాప్ పార్టీలను ఆర్గనైజింగ్ చేసేందుకు క్లబ్‌ల పేరుతో సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి. తాజాగా జరిగిన ఘటన.. చెన్నైలోని పన్నయోర్ అనే ఓ రిసార్ట్ ను కొందరు రెండు రోజుల పాటు రిజర్వ్ చేసుకున్నారు. అక్కడ పార్టీ చేసుకనేందుకు 8 మంది మహిళలు, 15 మంది పురుషులు వచ్చారు. సాయంత్రం పెద్ద శబ్దాలతో అందరూ కలిసి డ్యాన్స్ చేస్తుండగా.. తమకు ఇబ్బంది కలుగుతోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు ముందు భావించారు. ఆ తరువాత అక్కడున్న వారి నుంచి వివరాలు సేకరిస్తుండగా పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. జరుగుతున్నది కాక్ టైల్ పార్టీ కాదు.. స్వాప్ పార్టీ అని. మహిళలు, పురుషులను మార్చుకుని ఎంజాయ్ చేసేందుకే ఇక్కడకు వచ్చారని తేలింది.

కోయంబత్తూరు జిల్లాకు చెందిన సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఈ స్వాప్ పార్టీ క్లబ్ ను నిర్వహిస్తున్నాడని తెలిసింది. అతని ద్వారానే వీళ్ళందరూ ఒకచోటకు చేరినట్లు తేలింది. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వారిని సెంథిల్ కాంటాక్ట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు వీరందరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News