Women’s T20 World Cup 2026: మహిళల టి20 ప్రపంచక 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రెండు రోజుల కిందట ఈ టోర్నమెంట్ ప్రారంభం కాగా, నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఎడ్జ్ బస్టన్ వేదికగా ( Edgbaston, Birmingham) ఈ రెండు జట్లు తలపడగా… టీమిండియా 64 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్ కూడా వార్ వన్ సైడ్ అన్నట్లుగానే సాగింది. ఇక టీమ్ ఇండియా చేతిలో ఓటమిని తట్టుకోలేని పాకిస్తాన్ అభిమానులు.. విషం కక్కుతున్నారు. టీమిండియా మహిళల జట్టులో సగానికి పైగా మగాళ్ళే ఉన్నారని… అందుకే అవలీలగా పాకిస్తాన్ పైన గెలిచారంటూ పోస్టులు పెడుతున్నారు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఆదివారం రోజున పాకిస్తాన్ పై టీమిండియా మహిళల జట్టు 64 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ ఓటమిని తట్టుకొని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.. టీమిండియా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు. టీమిండియా జట్టులో సగానికి పైగా మగాళ్ళే ఉన్నారని.. అందుకే పాకిస్తాన్ పైన అవలీలగా గెలిచారు అంటూ రక రకాల పోస్టులు పెడుతున్నారు. భారతి ఫుల్మాలి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, దీప్తి శర్మ ఫోటోలను వైరల్ చేస్తూ.. వీళ్ళు ఆడాళ్లు కాదని.. మగాళ్లు అంటూ కారు కూతలు కూస్తున్నారు. పైన పేర్కొన్న ప్లేయర్ లందరూ బేబీ కటింగ్ చేయించుకొని మ్యాచ్ లు ఆడుతున్నారు.
ఇప్పుడే కాదు మొదటి నుంచి వాళ్ళు అంతే. హెయిర్ చిన్నగా ఉంటే… మ్యాచ్ పైన ఏకాగ్రత ఉంటుందన్న ముఖ్య ఉద్దేశంతో అలా బేబీ కటింగ్ చేయించుకుంటారు. బేబీ కటింగ్ చేయించుకున్న నేపథ్యంలో వాళ్లు కాస్త మగాళ్లలాగా కనిపిస్తారు. అయితే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న పాకిస్తాన్… వాళ్లపై విష ప్రచారం చేస్తోంది. వాళ్లు ఆడాళ్లు కాదని.. పురుషులే అంటూ పోస్టులు పెడుతోంది. అందుకే టీమిండియా పై అవలీలగా గెలిచారని దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఇలా తప్పుడు కూతలు కూస్తున్న నేపథ్యంలో..PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇదే పాట పాడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, పాకిస్తాన్ చేస్తున్న ప్రచారంపై టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఓడిపోయిన నేపథ్యంలో పాక్ సాకులు వెతుకుతోందంటూ పరువు తీస్తున్నారు.