Asian Legends League 2026: ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంటు (Asian Legends League 2026) చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. అన్ని జట్లు కూడా ఆసియా ఖండానికి సంబంధించినవే కావడం గమనార్హం. అయితే నిన్న ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ పాంథర్స్ (Pakistan Panthers) జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ జట్టుకు సంబంధించిన కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ ( Mohammad Hafeez) టోర్నమెంట్ నుంచి ఉన్నఫలంగా తప్పుకున్నాడు. కారణం చెప్పలేదు కానీ… కెప్టెన్ గా ఆఫర్ వచ్చినప్పటికీ వదులుకొని… టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. దీనిపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చాలా టోర్నమెంట్లు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ ఒకటి. అయితే ఈ టోర్నమెంట్ నిన్నటి నుంచి ప్రారంభం కాగా.. పాకిస్తాన్ కెప్టెన్ గా నియామకం అయిన మహమ్మద్ హఫీజ్… ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గుర్తింపు లేదని వార్తలు వస్తున్నాయి.
ఐసీసీ లేదా ఇతర అధికారిక బోర్డుల నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదట యాజమాన్యం. సొంతంగానే ఈ ఏషియన్ లెజెండ్స్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారట. అయితే ఈ విషయం తెలిసిన మహమ్మద్ హఫీజ్… ఉన్నఫలంగా టోర్నమెంటు నుంచి వైదొలిగినట్లు చెబుతున్నారు. ఐసీసీ అనుమతి లేకుండా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే.. చాలా నష్టాలు జరుగుతాయని మహమ్మద్ హఫీజ్ ముందుగా చెప్పి చూసాడట. అయినప్పటికీ యాజమాన్యంతో పాటు ఫ్రాంచైజీ వినలేదని సమాచారం. ఈ క్రమంలోనే టోర్నమెంట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు.
టీమిండియాతో మ్యాచ్ ఉన్న నేపథ్యంలోనే… భయపడ్డ మహమ్మద్ హఫీజ్, ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అయితే హఫీజ్ వార్త బయటకు రావడంతో టీమిండియా ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియాకు భయపడి… టోర్నమెంట్ నుంచి మహమ్మద్ హఫీజ్ వెళ్లిపోయాడని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవంగా ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆగస్టు 2వ తేదీన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది. ఐసీసీ ప్రాధాన్యత లేదన్న సంగతి తెలిసిన వెంటనే… మహమ్మద్ హఫీజ్ బయటకు వెళ్లిన చెబుతున్నారు.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !