E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు
Advertisement

Shoaib Akhtar On Pakistan Team:  పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిత్యం వార్తల్లో నిలుస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఈ క్రికెట్ జట్టు గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక వివాదం పాకిస్తాన్ క్రికెట్ జట్టు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అయితే అలాంటి పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై తాజాగా మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ జట్టులో చీలిక ఏర్పడిందని… ఈ జట్టులో సభ్యులు మూడు గ్రూపులుగా డివైడ్ అయినట్లు ఆరోపణలు చేశారు. మూడు గ్రూపులుగా విడిపోయి డ్రెస్సింగ్ రూమ్ లో తన్నుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అందుకే పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్టుల్లో పెద్దగా రాణించడం లేదని బాంబు పేల్చారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

Advertisement

వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ప్రస్తుతం టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో జూలై 25వ తేదీన మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్… ఓటమిపాలైంది. అంతకుముందు బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టు చేతిలోనూ ఓడిపోయింది. షాన్ మసూద్ ను పక్కకు పెట్టి బాబర్ ఆజంకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా కూడా… పరిస్థితి మారలేదు. పాకిస్తాన్ వరుసగా ఓడిపోతూనే ఉంది.

ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ వరుస ఓడిపోతున్న నేపథ్యంలో… ఆ జట్టు టెస్ట్ హోదాను ఐసీసీ కొనసాగించడం కష్టమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైన టెస్ట్ హోదాను కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ జట్లు… పాకిస్తాన్ లో పర్యటించాలంటే ఆలోచన చేస్తాయని షాకింగ్ విషయాలను పంచుకున్నారు. మొత్తంగా పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ ప్రమాదపు అంచున ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికైనా తేలుకోకపోతే పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని హెచ్చరించారు.

పాకిస్తాన్ ఇలా దిగజారడం వెనుక అదే కారణం

Advertisement

పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ ఇలా దిగజారడం వెనక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు ఉన్నారని బాంబు పేల్చారు షోయబ్ అక్తర్. రాజకీయ నాయకులకు… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాధ్యతలు అప్పగించారని.. మండిపడ్డారు. మొహ్సిన్ న‌ఖ్వీ లాంటి వాళ్లకు క్రికెట్ పై ఏమాత్రం అవగాహన లేదని.. అయినప్పటికీ అతని చేతిలో జట్టును పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. వెంట‌నే మొహ్సిన్ న‌ఖ్వీని త‌ప్పించాల‌ని, మాజీ క్రికెట‌ర్ల‌కు ఆ బాధ్య‌త‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు అక్త‌ర్‌.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

Related News

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

Big Stories

Advertisement
×