E-Paper
Advertisement

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?
Advertisement

Yuvraj Singh On Ms Dhoni:  టీమిడియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా పగ్గాలు అందుకున్న మహేంద్రసింగ్ ధోని… జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. రెండు వరల్డ్ కప్ లతో పాటు ఓ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందించి చరిత్ర సృష్టించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీ పై తాజాగా యువరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2007 సమయంలో తనకు కాకుండా… మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ ఇచ్చి బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుందని అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ ప్లేయర్లను కాదని ధోనికి ఇవ్వడం పట్ల, తాను భావోద్వేగానికి లోనైనట్లు గుర్తు చేశారు. వైస్ కెప్టెన్ గా ఉన్న త‌న‌ను కాద‌ని, ధోనికి బీసీసీఐ సార‌థ్య బాధ్య‌త‌లు ఇచ్చింద‌ని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అభిషేక్ శర్మను కాదని ఇషాన్ కిషన్ కు హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు కావ్య పాప ఇచ్చిందని ఫైర్ అయ్యారు. ఇలా ఇద్దరు బీహార్ వ్యక్తుల వల్ల తాను చాలా బాధపడుతున్నారని షాకింగ్ విషయాలను పంచుకున్నారు యువరాజ్ సింగ్.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి..న‌న్ను అవ‌మానించారు – యువ‌రాజు

Advertisement

2007 సమయంలో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా నియామకమైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని మరోసారి యువరాజు సింగ్ గుర్తు చేస్తూ… ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సీనియర్లు టీమిండియాలో ఉన్నప్పటికీ.. ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారని యువరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ సమయంలో వైస్ కెప్టెన్ గా ఉన్న తనకు కెప్టెన్ వస్తుందని అందరూ అనుకున్నట్లు గుర్తు చేశారు.

కానీ తనకు మొండి చేయి చూపించి.. ధోనికి కెప్టెన్సీ ఇచ్చారని బిసిసిఐపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో తనకు కెప్టెన్సీ ఇస్తే.. సీన్ వేరే లాగా ఉండేదని వ్యాఖ్యానించారు. అయితే ధోని కెప్టెన్సీలో టీమిండియా ఆఖండ విజయాలను నమోదు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. తనకు కాదని ధోనికి కెప్టెన్సీ బీసీసీఐ ఇచ్చిన నేపథ్యంలో తన తండ్రి యోగరాజ్ జీర్ణించుకోలేకపోయాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే ధోనీపై తరచూ తన తండ్రి కామెంట్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. తన తండ్రి తరఫున మహేంద్ర సింగ్ ధోనికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.

అభిషేక్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాల్సిందే

Advertisement

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం… ఇషాన్ కిషన్ కు కాకుండా అభిషేక్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని కోరారు యువరాజ్. పాట్ కమ్మిన్స్ అందుబాటులో లేకపోతే , ఇకపై ఇషాన్ కిషన్ ను కాకుండా అభిషేక్ శర్మకు చాన్స్ ఇవ్వాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతూ… జట్టును గెలిపిస్తున్నాడని గుర్తు చేశారు. జట్టు కోసం కష్టపడ్డ వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి కానీ… ఈ మధ్య వచ్చిన వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని కావ్య పాప పై ఫైర్ అయ్యారు.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

 

Related News

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

ఇండియా తమాషాలు చేస్తోంది…నఖ్వీని అవమానించిన వాళ్ళను ఉరి తీయాలి

ట్రోఫీ వద్దనుకున్న టీమిండియా, ఇకపై పాకిస్తాన్ తో మ్యాచ్ లు ఆడొద్దు

ఫిక్సింగ్ చేసి గెలిచారనే, టీమిండియాకు ట్రోఫీ ఇవ్వలేదు

చెప్పుతో కొట్టినట్టు ట్రోఫీ దొంగ నఖ్వీకి BCCI సరైన బుద్ది చెప్పింది

ఆడు మగాడ్రా బుజ్జి…ట్రోఫీ దొంగిలించి 150 కోట్ల భారతీయులను ఏడిపించాడు !

Big Stories

Advertisement
×