E-Paper
Advertisement

అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా
Advertisement

Muhammad Furqan Bhatti:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament) నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని… దాదాపు 50 లక్షల వరకు ప్రైజ్ మనీ కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియాలో కూడా అతనికి అవకాశం వచ్చింది. ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ తో జరిగే టి20 సిరీస్ నేపథ్యంలో అతనికి తొలి జట్టులో అవకాశం రానుంది. అలాగే ఏషియన్ గేమ్స్ లో (Asian Games 2026) కూడా అతడు ఆడనున్నాడు. ఇలాంటి నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ పై పాకిస్తాన్ జర్నలిస్టు మహ్మద్ ఫుర్హాన్ భట్టి ( Mohammad Furhan Bhatti ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీ వికెట్లు పాకిస్తాన్ ఆటగాడు అలీ రాజా ( Pakistan Bowler ali raza) తొలి బంతికే తీస్తాడంటూ సవాలు విసిరారు. అలా తీయకపోతే తాను బట్టలు లేకుండా తిరుగుతానంటూ సవాల్ విసిరాడు. దీంతో పాకిస్తాన్ జర్నలిస్టు మహ్మద్ ఫుర్హాన్ భట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా

Advertisement

ఏషియన్ గేమ్స్ 2026 అతి త్వరలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జపాన్ వేదికగా ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య క్రికెట్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో రెండు జట్ల సభ్యులను ఇప్పటికే ఆయా బోర్డులు ప్రకటించాయి. అయితే ఇందులో టీమిండియా తరఫున 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. అతని తొలి బంతికే డక్ అవుట్ చేస్తామంటూ తాజాగా పాకిస్తాన్ జర్నలిస్టు మహ్మద్ ఫుర్హాన్ భట్టి ( Mohammad Furhan Bhatti ) సంచలన ప్రకటన చేశారు. అలీ రాజా బౌలింగ్ లో తొలి బంతికే వైభవ్ ఔట్ కావడం గ్యారెంటీ అంటూ శపథం చేశారు.

అలా వైభవ్ అవుట్ కాకపోతే, తాను పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానంటూ ఛాలెంజ్ విసిరారు. అసలు వైభవ్ సూర్యవంశీ వయస్సు విషయంలో తమకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని షాకింగ్ ఆరోపణలు చేశారు. దీనిపై కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగి వైభవ్ సూర్యవంశీ కి డిఎన్ఏ పరీక్షలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అతని వయసు 15 సంవత్సరాలు కాదని.. కనీసం 25 సంవత్సరాలు ఉంటాడంటూ బాంబు పేల్చారు. దీంతో పాకిస్తాన్ జర్నలిస్టు మహ్మద్ ఫుర్హాన్ భట్టి ( Mohammad Furhan Bhatti ) చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

Advertisement

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

Related News

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

బ్యాటింగ్ చేయ‌కుండా, మైదానంలో రిజ్వాన్ రికార్డ్ డ్యాన్సులు చేస్తున్నాడు

పాకిస్తాన్ ను త‌క్కువ అంచ‌నా వేస్తున్నారు…2027 వ‌ర‌ల్డ్ క‌ప్ కొట్టి తీర‌తాం

ముఖం మీదే ఛీ కొట్టిన‌ మహ్మద్ యూసఫ్..త‌లదించుకున్న మొహ్సిన్ న‌ఖ్వీ

Big Stories

Advertisement
×