IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాటర్లలో షాహిన్ అఫ్రిది, ఫఖర్ జమాన్ రెచ్చిపోయారు. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయినప్పటికీ గెలిచినంత పని అయింది. ఎందుకు అంటే వాస్తవానికి టీమిండియా టాస్ గెలిస్తే.. ఫీల్డింగ్ తీసుకోవాలనే భావించింది.దీంతో టాస్ ఓడిపోయినప్పటికీ టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్, టీమిండియా రెండు జట్లు కూడా ఎలాంటి మార్పులు చేయకుండా తొలి మ్యాచ్ లో ఆడిన టీమ్ తోనే ఆడాయి. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఓవర్ బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ నే వైడ్ వేశాడు. ఆ తరువాత బంతికి పాకిస్తాన్ ఓపెనర్ అయూబ్ బుమ్రాకి క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు.
మరోవైపు బౌలింగ్ కి వచ్చిన బుమ్రా తన రెండో బంతినే మొహ్మద్ హారీస్.. హార్దిక్ పాండ్యా కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే..? బుమ్రా బౌలింగ్ లో హార్దిక్.. హార్దిక్ బౌలింగ్ లో బుమ్రా క్యాచ్ పట్టడం విశేషం. మరోవైపు బుమ్రా బౌలింగ్ లో ఫఖర్ జమాల్ ఔట్ అయినట్టు ఎంపైర్ ఔట్ ఇచ్చినట్టు రివ్యూ లో నాటౌట్ గా తేలింది. పాకిస్తాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాల్, పర్హాన్ వికెట్లు పడకుండా కాస్త అడ్డుకున్నారు. దీంతో అక్షర్ పటేల్ రంగంలోకి దిగి ఫఖర్ జమాన్(17) ని ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో జమాన్ వెనుదిరిగాడు. ఇక అక్షర్ తన తరువాత ఓవర్ లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ను పెవీలియన్ కి పంపాడు. అక్షర్ బౌలింగ్ లో బౌండరీ లైన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. తొలి 10 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు కేవలం 49/4 పరుగులు చేసింది.
ఇక ఆ తరువాత కుల్దీప్ యాదవ్ 13వ ఓవర్ బౌలింగ్ చేశాడు. 12.3 ఓవర్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా.. హాసన్ నవాజ్ క్యాచ్ డైవ్ చేసి ప్రయత్నించినప్పటికీ కుల్దీప్ కీ మిస్ అయింది. ఆ తరువాత బంతిని నవాజ్ గాలిలోకి లేపాడు. దీంతో అక్షర్ పటేల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో నవాజ్ వెనుదిరిగాడు. ఇక ఆ తరువాత బంతికే మొహ్మద్ నవాజ్ (0) ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నప్పటికీ.. మరోవైపు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (40) నిలకడగా ఆడాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద అద్బుతమైన క్యాచ్ అందుకోవడంతో పర్హాన్ వెనుదిరిగాడు. చివర్లో వచ్చిన షాహిన్ అఫ్రిది వచ్చి రావడంతో 6 బాదాడు. దీంతో చివర్లో కాస్త స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వరుస సిక్స్ ల తో రెచ్చిపోయాడు. 16 బంతుల్లో 33 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 1, బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి 1 చొప్పున వికెట్లు తీశారు.