Ind vs Pak Asia Cup 2025 : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) భాగంగా దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan ) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి తక్కువ ధర పరుగులకే కుప్ప కూలింది. భారత బౌలింగ్ దెబ్బకు.. భారీ స్కోర్ చేయలేక.. చాలా తడబడింది పాకిస్తాన్. వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్లు వరుసగా కోల్పోయిన పాకిస్తాన్ ను చూసి…. ఇండియన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. అంతేకాదు కొంతమంది పాకిస్తాన్ అభిమానులకు హగ్గులు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
Also Read: Grace Hayden : దయచేసి ఆ పని చెయ్… లేకపోతే నగ్న***గా తిరగాల్సి వస్తుంది… హెడెన్ కూతురు ఎమోషనల్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ బైకాట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేసిన చాలామంది… ఇప్పుడు మళ్లీ గ్రౌండ్లో కనిపించారని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది పాకిస్తాన్ అభిమానులకే హగ్గులు ఇస్తున్నారని మండిపడుతున్నారు మ్యాచ్కు దూరంగా ఉన్న అభిమానులు. ఇదెక్కడి సంతరా అంటూ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించాలని కూడా మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
ఇండియాలోని పహల్గం ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి నేపథ్యంలో భారతీయులు దాదాపు 20 మంది మరణించారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సింధూర్ కూడా నిర్వహించింది ఇండియన్ సర్కార్. ఈ తరుణంలోనే 100 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చింది ఇండియన్ ఆర్మీ. దీంతో అప్పటినుంచి పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్లు నిర్వహించకూడదని చాలామంది డిమాండ్లు చేశారు. అయినప్పటికీ ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా మ్యాచులు నిర్వహిస్తున్నారు. అందుకే ఇవాళ జరుగుతున్న మ్యాచ్ ను బైక్ హార్ట్ చేయాలని డిమాండ్లు వినిపించాయి.
ఈ దుబాయ్ మ్యాచ్ లో తక్కువ పరుగులకే కుప్పకూలింది పాకిస్థాన్. ఎవరూ ఊహించని చెత్త ప్రదర్శన చేసింది పాకిస్థాన్. నిర్ణీత 20 ఓవర్స్ లో 9 వికెట్లు నష్టపోయి 127 పరుగులు మాత్రమే చేసింది. చివరలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహీన్ అఫ్రిది అదిరిపోయే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. దీంతో… 100 కు పైగా పరుగులు సాధించగలిగింది పాకిస్థాన్. అటు పాకిస్థాన్ కెప్టెన్ తో పాటు మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అటు టీమిండియా బౌలింగ్ విభాగం మరోసారి రెచ్చిపోయింది. ఇవాళ టీమిండియా బౌలర్లు అందరూ రఫాడించారు. కుల్దీప్ యాదవ్ అయితే… మరోసారి 3 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ నడ్డి విరిచాడు. అటు బుమ్రా, పాండ్యా, అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తి కూడా దుమ్ములేపారు. ( Team India vs Pakistan )
Also Read: Watch Video : పూజలు మానేసి…క్రికెట్ లోకి వచ్చేస్తున్న పూజార్లు…సిక్సులతో దుమ్ములేపారు !
the boycott happening from stadium 😭😭 #INDvsPAK pic.twitter.com/VzZW2tF3tx
— sohom (@AwaaraHoon) September 14, 2025