నోరు జారారో, లేక తనపై వస్తున్న ఆరోపణలను ఖండించే క్రమంలో కాస్త ఆవేశానికి గురయ్యారో తెలియదు కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేథస్సు విలువ రూ. 200 కోట్లు అని చెప్పారాయన. కేవలం తన మెదడు ఉపయోగించడం ద్వారా తనకు నెలకు రూ.200 కోట్లు ఆదాయంగా వస్తుందని.. రాజకీయాల్లో మోసం చేసి సంపాదించాల్సిన అవసరం, అగత్యం తనకు లేదన్నారు?
ఎందుకీ వివరణ..?
పెట్రోల్ లో ఇథనాల్ కలిపి అమ్మడంపై ఇటీవల తీవ్ర విమర్శలు రేగుతున్న సంగతి తెలిసిందే. గతంలో 10శాతం ఇథనాల్ కలిపి అమ్మేవారు. తాజాగా దాన్ని 20శాతానికి పెంచారు. ఇథనాల్ శాతాన్ని పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందనేది ప్రభుత్వ వాదన. అయితే ఇటీవల కొందరు ఈ వాదనను ఖండించారు. ఇలా ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ ఇంజన్లు పాడైపోతున్నాయని చెప్పారు. కొన్ని కంపెనీలు ఇథనాల్ పెట్రోల్ ని వాడితే ఇంజిన్ పై ఇచ్చే వారంటీని తొలగిస్తున్నాయని కూడా ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఈ వివాదం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీవైపు తిరిగింది. ఆయనే ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారని, దీని వల్ల ఆయనకు లాభం ఉందని అన్నారు. ఈ ఆరోణలను ఖండించే క్రమంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఆదాయం ఎలా..?
నాగ్ పూర్ లో అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సందర్భంగా నా బ్రెయిల్ విలువ రూ.200కోట్లు.. నేను మోసంతో కాదు, నిజాయితీతో సంపాదిస్తున్నాను తన పిల్లలిద్దరూ వ్యాపాల్లో స్థిరపడ్డారని, వారికి తాను పలు సూచలనలు ఇస్తానని, తన సూచనల వల్ల వచ్చే ఆదాయమే నెలకు రూ.200 కోట్లు ఉంటుందని చెప్పారు గడ్కరీ. తానెవర్నీ మోసం చేయడం లేదని కూడా అన్నారు. ఇటీవల తన ఇరాన్ నుంచి 800 కంటైనర్ల యాపిల్స్‌ను దిగుమతి చేశారని, 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశారని చెప్పుకొచ్చారు. తనకు డబ్బుకు కొదవలేదని, షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీస్, పవర్ ప్లాంట్ వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత లాభం కోసం కాకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తాను కృషఇ చేస్తున్నానని స్పష్టం చేశారు గడ్కరీ. తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన ఆయన, పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం జరగుతోందని ఆరోపించారు.
మరి లెక్కలు చెబుతారా..?
తన బ్రెయిన్ వేల్యూ రూ.200 కోట్లు అని, నెలకు తన సంపాదన రూ.200 కోట్లు పైనే ఉంటుందని చెబుతున్న నితిన్ గడ్కరీ.. ఆదాయపు పన్ను శాఖకు దీనికి సంబంధించిన లెక్కలు చెబుతున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఎన్నికల అఫిడవిట్ లో అయినా ఈలెక్కలు పొందు పరిచారా అని లాజిక్ తీస్తున్నారు. ఒకవేళ తప్పుడు లెక్కలు చెబితే దానికి శిక్ష అనుభవిస్తారా అని అడుగుతున్నారు. మొత్తమ్మీద తనపై వచ్చిన ఆరోపణలను ఖండించే క్రమంలో సంచలన వ్యాఖ్యలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారారు నితిన్ గడ్కరీ.