BigTV English

Teamindia : తిప్పేసిన కులదీప్.. బంగ్లాదేశ్ 150కే ఆలౌట్.. భారత్ కు భారీ ఆధిక్యం..

Teamindia : తిప్పేసిన కులదీప్.. బంగ్లాదేశ్ 150కే ఆలౌట్.. భారత్ కు భారీ ఆధిక్యం..

TeamIndia: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టు సాధించింది. బంగ్లాదేశ్ ను తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ చేసింది. కులదీప్ స్పిన్ మాయాజలం, సిరాజ్ పేస్ మ్యాజిక్ ముందు బంగ్లా బ్యాటర్లు నిలబడలేకపోయారు. 133/8 ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మరో 17 పరుగులు జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది.


144 పరుగుల వద్ద ఎబాదత్ ను కీపర్ క్యాచ్ ద్వారా కులదీప్ అవుట్ చేశాడు. మెహదీ హసన్ మిరాజ్, ఎబాదత్ హోస్సేన్ కలిసి 9 వికెట్ కు 42 పరుగులు జోడించారు. బంగ్లా ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక భాగస్వామం కావడం విశేషం. ఆ తర్వాత మెహదీ హసన్ మిరాజ్ ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

బౌలింగ్ భళా
భారత్ బౌలర్ల చెలరేగడంతో బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. ఆ జట్టులో అత్యధికంగా ముష్పీకర్ రహీమ్ 28 పరుగులు చేయగా.. మెహదీ హసన్ మిరాజ్ 25, లిట్టన్ దాస్ 24, జహీర్ హసన్ 20 పరుగులు చేశారు. తొలుత బంగ్లా టాప్ ఆర్డర్ ను మహమ్మద్ సిరాజ్ కుప్పకూల్చాడు. ఆ తర్వాత స్పిన్నర్ కులదీప్ యాదవ్ మిడిల్ ఆర్డర్ , లోయర్ ఆర్డర్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చాడు. అద్భుత ప్రదర్శన చేసి కులదీప్ కు 5 వికెట్లు నేలకూల్చాడు. సిరాజ్ కు 3 వికెట్లు దక్కాయి. ఉమేష్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.


బంగ్లాదేశ్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేసిన టీమిండియా ఆ జట్టును ఫాలో ఆన్ ఆడించలేదు. భారత్ జట్టే రెండో ఇన్సింగ్ లో బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ లో తొలి రెండు రోజులు ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మూడోరోజు అదే జోరు కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. రెండో ఇన్నింగ్స్ లోనూ బౌలర్లు ఇదే ప్రదర్శన చేస్తే ఈ మ్యాచ్ లో టీమిండియా సునాయాసంగా గెలవడం ఖాయం.

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×