BigTV English

Temba Bavuma : వన్డే వరల్డ్ కప్ ప్రెస్ మీట్ లో గుర్రు పెట్టి నిద్రపోయిన కెప్టెన్..

Temba Bavuma : వన్డే వరల్డ్ కప్ ప్రెస్ మీట్ లో గుర్రు పెట్టి నిద్రపోయిన కెప్టెన్..

Temba Bavuma : ప్రస్తుతం ఎక్కడ చూసినా జరగబోయే వన్డే వరల్డ్ కప్ విశేషాలు కనిపిస్తున్నాయి. ఈరోజు జరగనున్న తొలి మ్యాచ్ కి ఇంగ్లండ్, నెదర్లాండ్ టీమ్ లు సిద్ధంగా ఉన్నాయి. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఆరంభానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. అయితే ప్రస్తుతం జరగబోయే మ్యాచ్ కంటే కూడా జరిగిపోయిన ఒక సంఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ ప్రారంభానికి ముందు కెప్టెన్ల సమావేశం జరిగింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా…


వివరాల్లోకి వెళ్తే …. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 10 దేశాల టీమ్ల కెప్టెన్లతో అరేంజ్ చేసిన మీటింగ్ కు ముఖ్య అతిథిగా 2019 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీం ని గెలిపించిన ఇయాన్ మోర్గాన్ ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. ఈ మీటింగ్ కు హోస్ట్ గా వ్యవహరించిన రవి శాస్త్రి.. పది టీములకు సంబంధించిన కెప్టెన్లతో ,వరల్డ్ కప్ మ్యాచ్ కి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ప్రతి టీం ఎటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందో కెప్టెన్ దగ్గర చెప్పించే ప్రయత్నం కూడా చేశాడు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మీటింగ్ లో భాగంగా డిస్కషన్ జరుగుతున్న సమయంలో సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ బావుమా డిస్కషన్ మెల్లిగా ఒక చిన్నపాటి కునుకు తీశాడు. అలా నిద్రపోతున్న ఆతడు అక్కడ ఉన్న కెమెరా కంటికి ఇట్టే చిక్కాడు. ఇంకేముంది ఆ ఫోటో వైరల్ అవ్వడంతో పాటు.. ఆన్లైన్లో తెగ హడావిడి చేస్తోంది.కారు చిచ్చులా ఆన్లైన్లో స్ప్రెడ్ అయిన ఆ ఫోటోకి వివరణ ఇస్తూ తాను నిద్రపోలేదు అని బావుమా స్పష్టం చేశాడు. నిజానికి గత వారం నుంచి పూర్తి ప్రయాణాలతోటే గడిపిన 


బావుమా.. సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి చేరుకున్న తర్వాత మళ్లీ కొన్ని పర్సనల్ పనుల కారణంగా వెళ్లి రెండు రోజుల ముందే ఇండియాకి రావడం జరిగిందట. అందుకే అలసిపోయి అలా టైం దొరికినప్పుడు కాస్త రెస్ట్ తీసుకోని ఉంటాడు అని అందరూ భావిస్తున్నారు.

అయితే బావుమా మాత్రం …అంత ఇంపార్టెంట్ మీటింగ్ లో అలా ఎలా నిద్రపోతాను…ఆ ఫోటో కేవలం కెమెరా యాంగిల్ సరిగ్గా లేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది అంటూ స్పందించాడు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ లో స్పష్టం చేశారు.బావుమా నిద్రపోతున్నట్టు ఉన్న ఫోటోని ఇంగ్లాండ్ ఫేమస్ బార్మీ ఆర్మీ ఫ్యాన్ పేజీ షేర్ చేయడంతో దానికి బావుమా ” ఇది కేవలం కెమెరా యాంగిల్ పొరపాటు.. నేను నిద్ర పోలేదు” అంటూ రెస్పాండ్ అయ్యారు. అది నిజంగా కెమెరా యాంగిల్ పొరపాటా లేక మరేదైనా అన్న విషయం అయితే తెలియదు కానీ మొత్తానికి వరల్డ్ కప్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఒక కునుకు తీసిన కెప్టెన్ గా బావుమా సరికొత్త రికార్డును మాత్రం సృష్టించాడు.

Related News

Kusal Perera Injury : చావు బతుకుల్లో శ్రీలంక క్రికెటర్.. తలకు బంతి తగలడంతో.. వీడియో వైరల్

Poonam Kaur – Siraj: టాలీవుడ్ హాట్ బ్యూటీతో మహమ్మద్ సిరాజ్… బిజెపిలోకి వెళ్తున్నాడా ?

Cristiano Ronaldo: రోనాల్డో ఎంగేజ్మెంట్ రింగ్ ధర ఎంతో తెలుసా.. ఆయనకు కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!

5 Balls Won Match: 5 బంతుల్లో ముగిసిన మ్యాచ్…7 గురు డకౌట్… 23 పరుగులకే ఆలౌట్

Mohamed Siraj : సేమ్ టు సేమ్ డిట్టు దించేశారు… మహమ్మద్ సిరాజ్ కూడా కుళ్ళుకోవాల్సిందే

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

Big Stories

×