BigTV English

IPL 2025: ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా..!

IPL 2025: ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా..!

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 లో భాగంగా శనివారం రోజు క్రికెట్ అభిమానులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మ్యాచ్ నెంబర్ 17 లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్ లలో గెలిచి జోరు మీద ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ ఏడాది అంచనాలకు తగ్గట్లు రాణించడం లేదు.


 

ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచి.. మిగతా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నేడు హోమ్ గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ లో గెలిచి మళ్ళీ రేసులోకి రావాలని పట్టుదలతో ఉంది చెన్నై. అయితే మోచేతి గాయం కారణంగా కెప్టెన్ ఋతురాజు గైక్వాడ్ నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ కి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను ధోని చేపట్టే అవకాశాలు ఉన్నాయి.


ఇక రెండవ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొననున్నాయి. ఈ సీజన్ లో వరుస విజయాలతో పంజాబ్ జోరు మీద ఉండగా.. రాజస్థాన్ మాత్రం వరుస ఓటములతో డీలా పడింది. గత పదేళ్లుగా ప్లే ఆఫ్స్ కి చేరలేకపోయిన పంజాబ్ జట్టు.. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తాజా సీజన్ లో జోరు మీదుంది పంజాబ్. ఇక ఇతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైష్వాల్ పై ఒత్తిడి అధికంగా ఉంది.

గత మూడు మ్యాచ్లలో జైష్వాల్ 1, 29, 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నేడు జరగబోయే మ్యాచ్లో ఎటువంటి ప్రదర్శన చేస్తాడో వేచి చూడాలి. ఈ సీజన్ తొలి 3 మ్యాచ్ లలో కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగిన సంజు శాంసన్.. ఈ మ్యాచ్ లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకోనున్నాడు. గాయం నుండి పూర్తిగా కోలుకోవడంతో వికెట్ కీపింగ్ చేసేందుకు బీసీసీఐ అతడికి అనుమతిని ఇచ్చింది. ఇక గత రెండు మ్యాచ్లలో చక్కటి ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్.. సొంత గడ్డపై తొలి మ్యాచ్లో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. నేడు {శనివారం} జరిగే ఈ డబుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ లలో ఏ జట్లు గెలుపొందుతాయో వేచి చూడాలి.

CSK జట్టు అంచనా: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (c), శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, MS ధోని (wk), R అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరణ, ఖలీల్ అహ్మద్.

డిసి అంచనా వేసిన జట్టు: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×