PAN-Aadhaar linking: దేశ వ్యాప్తంగా డిజిటల్ సదుపాయాలు విస్తరిస్తున్న వేళ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వ్యాపార రంగంపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో తాజాగా పాన్ కార్డ్ కలిగిన వారు ఇప్పటికీ ఆధార్‌తో లింక్ చేయలేదా. అయితే ఇప్పటికైనా చేయండి. ఎందుకంటే తాజాగా దీని చివరి గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించారు.
గణనీయమైన ప్రభావం
ఆధార్ నామినేషన్ ఐడితో పాన్ కార్డ్ పొందిన వారు తప్పకుండా తమ అసలైన ఆధార్ నంబర్‌ను పన్ను శాఖకు సమర్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మార్పు వ్యాపార వర్గాలు, ఫ్రీలాన్సర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు, అలాగే చిన్న వ్యాపారులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. పన్ను వ్యవస్థలో పారదర్శకత, సమాచార సమన్వయం, మదింపు సామర్థ్యం పెంచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్కరణలు వ్యాపారాలు తమ లావాదేవీలను ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తాయి.
విశ్వసనీయత పెంచాలని
అక్టోబర్ 1, 2024 లేదా అంతకు ముందు ఆధార్ నామినేషన్ ఐడిని ఉపయోగించి పాన్ పొందినవారు, డిసెంబర్ 31, 2025లోగా తమ ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమర్పించాలి. ఇది ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AAకి అనుగుణంగా తీసుకున్న చర్య. ప్రభుత్వం ఈ మార్గదర్శకాన్ని ప్రకటించడం ద్వారా డేటా విశ్వసనీయతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నిబంధనలు ఎవరిని ప్రభావితం చేస్తాయి?
ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా వీరిని టార్గెట్ చేస్తోంది. ఆధార్ నంబర్ లేని వారు, ఆధార్ నామినేషన్ ID ద్వారా పాన్ తీసుకున్నవారు. అక్టోబర్ 1, 2024కి ముందు అటువంటి పాన్ కార్డ్ జారీ అయ్యింది. ఈ పాన్ తీసుకున్న తర్వాత వారు ఇంకా అసలు ఆధార్ నంబర్ పొందకపోతే, ఇప్పుడు ఆ వివరాలు సమర్పించడం తప్పనిసరి. ఈ చర్య వల్ల కేవలం డేటా క్లీనప్ కాకుండా, అనవసరమైన పాన్ లింకింగ్ సమస్యలకూ చెక్ పెట్టవచ్చు.
జరిమానా గురించి
ఇప్పటివరకు ఈ కొత్త నిబంధనల కింద అటువంటి పాన్ హోల్డర్లకు జరిమానా ఉండొచ్చా లేదా అనే అంశం స్పష్టంగా లేదు. అయితే సాధారణ పాన్-ఆధార్ లింకింగ్‌కు పన్ను శాఖ రూ.1000 జరిమానా విధించింది. అందువల్ల, ఈ సందర్భంలో కూడా కొంతమంది జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. కానీ ప్రధానంగా, ఇది ఆధార్ నంబర్ లేని వారికి ప్రత్యేక మినహాయింపు లాంటిదే. ప్రభుత్వం ఆధార్ పొందిన తర్వాత డిసెంబర్ 31, 2025లోపు సంబంధిత వివరాలను సమర్పించే అవకాశం ఇస్తోంది.
పాన్-ఆధార్ లింకింగ్ ఎందుకు అంత అవసరం?
-డూప్లికేట్ పాన్‌లను తొలగించవచ్చు.
-అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించవచ్చు.
-టాక్స్ ఫైలింగ్‌ను మరింత సులభతరం చేయవచ్చు.
-బ్యాంకింగ్, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ వంటి అనేక అధికారిక పనులలో చట్టబద్ధత కలుగుతుంది.
-ప్రభుత్వానికి సరైన డేటా ఉండటం వల్ల, పన్ను ఎగవేతలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
-డిసెంబర్ 31, 2025లోగా ఆధార్ లింక్ చేయకపోతే, పాన్ కార్డ్ పనిచేయకుండా మారుతుంది. పన్ను వ్యవహారాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు పాన్-ఆధార్ లింక్ చేయాలంటే ఎలా?
-మీకు ఇప్పటికే ఆధార్ ఉన్నట్లయితే, ఈ క్రింది విధంగా లింక్ చేయొచ్చు:
-ఆధికారిక ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ (https://incometax.gov.in) సందర్శించండి.
-“Link Aadhaar” సెక్షన్‌కు వెళ్లండి.
-పాన్ నంబర్, ఆధార్ నంబర్, పేరు వంటి వివరాలు నమోదు చేయండి.
-OTP ద్వారా ధృవీకరణ చేయండి.
-అవసరమైతే ఫీజు చెల్లించండి (ప్రస్తుతానికి ఇది సాధారణ లింకింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది).