Travis Head ON IPL vs PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) చాలా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 19 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండానే ముందుకు వెళ్తోంది. కరోనా, లాక్ డౌన్, ఎన్నికలు ఇలా ఎన్నో అవాంతరాలు ఐపీఎల్ టోర్నమెంట్ కు ఎదురయ్యాయి. అయినప్పటికీ బీసీసీఐ చాలా సమర్థవంతంగా ఈ టోర్నమెంట్ ను నిర్వహించింది. 2008 సంవత్సరంలో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్.. బ్రేకులు లేకుండా ఇప్పటివరకు కొనసాగింది.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
అవసరమైతే ఏడాదికి రెండు టోర్నమెంట్లు నిర్వహించేందుకు కూడా బీసీసీఐ సిద్ధంగా ఉంది. అయితే అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ (Travis Head) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో డబ్బులు తప్ప ఏమీ ఉండవని.. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో (Pakistan Super League tournament) టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే ఉంటారని బాంబు పేల్చాడు. అతి త్వరలోనే ఐపిఎల్ టోర్నమెంట్ను వదిలేసి…. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడతానని కూడా శపథం చేశారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా కోట్లు సంపాదించిన సన్ రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఓపెనర్ హెడ్ ప్లేట్ ఫిరాయించాడు. అన్నం పెట్టిన బీసీసీఐకే సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటును కించపరుస్తూ ట్రావిస్ హెడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కోట్లల్లో డబ్బులు చేతులు మారుతున్నాయని వెల్లడించారు. ఐపీఎల్ లో ఒక్క సీజన్ ఆడినా… కోట్లు రావడం గ్యారంటీ అని తెలిపారు. తాను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా కోట్లు సంపాదించినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే ఐపీఎల్ ఆడుతున్నానని… అయితే ఈ టోర్నమెంట్లో కేవలం డబ్బులు మాత్రమే కనిపిస్తాయని వివరించారు.
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో మాత్రం రియల్ టాలెంట్ ప్లేయర్లు ఉన్నారని వెల్లడించారు. అక్కడ డబ్బులు ఎక్కువగా దొరకవు… కానీ టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రం చాలామంది ఉన్నారని కొనియాడారు. తన దృష్టిలో ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ బెస్ట్ అంటూ కితాబ్ ఇచ్చారు. 2038 వరకు తాను పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో ఆడేందుకు వెళ్తానని హేళన చేస్తూ మాట్లాడారు. అంటే తన దగ్గర సామర్థ్యం ఉన్నంతసేపు ఐపీఎల్ ఆడి… కోట్లు సంపాదిస్తానని పరోక్షంగా తెలిపాడు. రిటైర్మెంట్ వయసులో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడతానని హేళన చేస్తూ మాట్లాడాడు. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అంటే రిటైర్మెంట్, అన్ సోల్డ్, పనికిరాని ప్లేయర్ల అడ్డగా మారిపోయిందని చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా హెడ్ కూడా అదే స్పష్టం చేశాడు. దీంతో హెడ్ ఐపీఎల్, పీఎస్ఎల్ లలో ఏ లీగ్ ను మెచ్చుకున్నాడు? ఎవరిని కించపరిచాడు ? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం