IND VS PAK: ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ (Asian Legends League 2026) ఇవాల్టి నుంచి షురూ కానుంది. జూలై 30 అంటే నేటి నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. జాంబియా వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ మ్యాచ్ ఆగస్టు రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఉండనుంది. ఇండియన్ రాయల్స్ వర్సెస్ పాకిస్తాన్ పాంథర్స్ (Indian Royals vs Pakistan Panthers) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ తరుణంలోనే ప్లేయర్ల మధ్య షేక్ హ్యాండ్ ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. హర్భజన్ సింగ్ మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చేది లేదంటున్నారు.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !
ఏషియన్ లెజెండ్స్ లెజెండ్స్ 2026 టోర్నమెంట్ లో (Asian Legends League 2026) భాగంగా ఇండియన్ రాయల్స్ వర్సెస్ పాకిస్తాన్ పాంథర్స్ (Indian Royals vs Pakistan Panthers) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానుంది. జాంబియాలోని లోటస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే ( Lotus Sports Club Ground, Lusaka) ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫ్యాన్ కోడ్ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. లేదా దీనికి సంబంధించిన వెబ్ సైట్ లో కూడా స్కోర్ వివరాలు పరిశీలించవచ్చు. గ్రూప్ స్టేజ్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా… నాకౌట్ స్టేజ్ లో కూడా తలపడే అవకాశాలు ఉంటాయి. అదృష్టం బాగుంటే ఈ టోర్నమెంట్ లో భాగంగా జరిగే ఫైనల్స్ లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే ఛాన్సులు ఎక్కువ.
ఇండియన్ లెజెండ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా 6 జట్లు పాల్గొంటాయి. ఇండియన్ రాయల్స్ ( Indian Royals ), పాకిస్తాన్ పాంథర్స్, శ్రీలంక లయన్స్, బంగ్లాదేశ్ టైగర్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఏషియన్ స్టార్స్ ఈ టోర్నమెంట్లో తలపడనున్నాయి. ఇక ఇండియన్ రాయల్స్ జట్టు తరఫున శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్, సురేష్ రైనా, ఓజా లాంటి ప్లేయర్లు పాల్గొంటారు. ఈ జట్టుకు యూసఫ్ పఠాన్ ( Yousuf Pathan) కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.