E-Paper
Advertisement

సైమాలో ‘మిరాయ్’ మోత.. 11 నామినేషన్స్‌తో రికార్డ్!

సైమాలో ‘మిరాయ్’ మోత.. 11 నామినేషన్స్‌తో రికార్డ్!
Advertisement

SIIMA Nominations: 2025లో థియేటర్లలో సందడి చేసిన సినిమాలకు ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2026 నామినేషన్స్ అధికారికంగా బయటకు రావడంతో టాలీవుడ్‌లో మళ్లీ అవార్డుల వేడి మొదలైంది. ఈసారి మాత్రం అందరి చూపు ఒక్క సినిమాపైనే పడింది. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ ఏకంగా 11 విభాగాల్లో నామినేట్ అవుతూ తెలుగు సినిమాల్లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు అవార్డుల రేసులోనూ అదే జోరు కొనసాగించడం విశేషం.

2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకుని సైమా కమిటీ ఈ నామినేషన్స్ ప్రకటించింది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అయితే తెలుగు నుంచి ‘మిరాయ్’ మాత్రం స్పెషల్ గా నిలిచింది.

Advertisement

మిరాయ్ 

కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విడుదలైన రోజునుంచే మంచి టాక్ తెచ్చుకుంది. తేజ సజ్జ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా, మంచు మనోజ్ విలన్‌గా చేసిన పాత్ర సినిమాకు మరో పెద్ద ప్లస్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అవార్డుల జాబితాలో కూడా సత్తా చాటుతోంది.

Advertisement

సంక్రాంతికి వస్తున్నాం

‘మిరాయ్’ తర్వాత ఎక్కువ నామినేషన్స్ సాధించిన తెలుగు సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మొత్తం 10 విభాగాల్లో చోటు కొట్టేసింది. సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకులను నవ్విస్తూ, ఎమోషన్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ నటనకు కూడా మంచి అప్లాజ్ రావడంతో ఇప్పుడు అవార్డుల రేసులో గట్టి పోటీ నే ఇస్తుంది.

తండేల్

అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచిన ‘తండేల్’ కూడా ఈసారి సైమాలో గట్టి పోటీ ఇస్తోంది. మొత్తం 9 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్న ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెల్సిందే. దర్శకుడు చందు మొండేటి ఎమోషనల్ కథను అద్భుతంగా తెరకెక్కించగా, సాయి పల్లవి తన నటనతో సినిమాని మరో మెట్టు ఎక్కించింది. అవార్డుల పరంగా కూడా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే  కనిపిస్తున్నాయి.

‘కోర్ట్’

ఇక మరోవైపు కంటెంట్ పరంగా ప్రశంసలు అందుకున్న ‘కోర్ట్’ సినిమా కూడా 9 విభాగాల్లో నామినేట్ కావడం విశేషం. కమర్షియల్ సినిమాలతో పాటు మంచి కథలకు కూడా సైమా ప్రాధాన్యం ఇస్తోందని ఈ నామినేషన్స్ మరోసారి నిరూపించాయి.

మిగతా భాషల్లోనూ గట్టి పోటీ

తెలుగు మాత్రమే కాదండోయ్ ….. మిగతా భాషల్లోనూ భారీ సినిమాల మధ్య గట్టి పోటీనే కనిపిస్తుంది.తమిళం నుంచి ‘డ్రాగన్’ 11 కేటగిరీల్లో నామినేట్ కాగా, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ 9, ‘బిసన్’ 7 విభాగాల్లో స్థానాన్ని దక్కించుకున్నాయి.. కన్నడలో ‘కాంతార చాప్టర్ 1’ 10 కేటగిరీలలో , ‘సు సో ఫ్రమ్’, ‘ఎర’, ‘గీతాంజలి’ కూడా చెప్పుకోతగ్గ సంఖ్యలో నామినేషన్స్ అందుకున్నాయి. మలయాళంలో ‘కొత్త లోక చాప్టర్ 1’ 11 విభాగాల్లో, ‘తుడరుమ్’, ‘సర్వం మాయ’  10 విభాగాల్లో నామినేషన్స్ అందుకోవడం విశేషం.

చూడాలి మరి  సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనున్న ఈ అవార్డ్ వేడుకల్లో ఎవరు సత్తా చాటుతారో!

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×