Ahmad Shahzad On Rizwan: పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ ( West Indies vs Pakistan ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ మొన్న జులై 25వ తేదీన ప్రారంభమైంది. ఈ క్రమంలో బ్రియన్ లారా స్టేడియం (Brian Lara Stadium, Tarouba, Trinidad) వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్.. 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో కూడా మహమ్మద్ రిజ్వాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్ లో కూడా విఫలమయ్యాడు. దీంతో మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రతి మ్యాచ్ లో ఓవరాక్షన్ చేయడం తప్ప… బ్యాటింగ్ చేతకావడం లేదని ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.
వెస్టిండీస్ టూర్ నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఆట తీరుపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైదానంలో బ్యాటింగ్ చేయడం చేతకావడం లేదని.. కేవలం డ్యాన్స్ మాత్రం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. మైదానంలో దిగిన తర్వాత, పాకిస్తాన్ జట్టును గెలిపించాల్సిన మహమ్మద్ రిజ్వాన్… చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాడని ఫైరయ్యారు. వికెట్ల వెనకాల నిలబడి స్టంపింగ్ కూడా సరిగ్గా చేయడం లేదని సీరియస్ అయ్యారు.
ఇలాంటి వాడిని ఎందుకు జట్టులోకి తీసుకున్నారని పాకిస్తాన్ సెలెక్టర్లను నిలదీశారు. వికెట్ కోల్పోయిన తర్వాత.. మ్యాచ్ పరిస్థితులను గ్రహించాల్సిన మహమ్మద్ రిజ్వాన్… డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని ఖురాన్ చదవడం అవసరమా ? అంటూ నిలదీశారు. ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసి… ఓ మతాన్ని ప్రేరేపిస్తూ పుస్తకాలు చదవడం ఎక్కడ లేదని మండిపడ్డారు. ఖురాన్ పైన పెడుతున్న ఫోకస్… క్రికెట్ పైన పెట్టాలని సూచనలు చేశారు. మహమ్మద్ రిజ్వాన్ ఇలాగే వ్యవహరిస్తే… పాకిస్తాన్ జట్టు నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad).
వెస్టిండీస్ టోర్నమెంట్ నేపథ్యంలో మొదటి టెస్ట్ మ్యాచ్ మొన్న జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన మహమ్మద్ రిజ్వాన్.. కీలక సమయంలో విఫలమయ్యాడు. 17 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు మాత్రమే చేసి.. పాకిస్తాన్ కొంపముంచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా బాబర్ కు అండగా నిలవాల్సిన మహమ్మద్ రిజ్వాన్.. పెద్ద బిల్డప్ ఇచ్చి 11 పరుగులు మాత్రమే చేశాడు. గతంలోనూ ఇదే ప్రదర్శన కనబరిచిన నేపథ్యంలో మహమ్మద్ రిజ్వాన్ పై విమర్శలు వస్తున్నాయి.
Also Read: Trolls On Virat Kohli: లండన్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవమానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !