Trolls on Ben Duckett: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి ఇంగ్లాండ్ జట్టు ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య లాహోర్ లోని గడాఫి స్టేడియంలో తొలి మ్యాచ్ జరిగింది. గ్రూప్ – బి లో భాగంగా జరిగిన ఈ రెండవ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణయత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టు 15 బంతులు మిగిలి ఉండగానే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
ఇక బుధవారం ఇదే గడాఫీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ – ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మరో పోరు జరిగింది. ఈ రెండవ మ్యాచ్ లోనూ ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్స్ కి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఇంగ్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. పటిష్టమైన ఇంగ్లాండ్ జట్టును ఆఫ్ఘనిస్తాన్ బోల్తా కొట్టించి సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది. ఇంగ్లాండ్ పై తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో గెలిచి రికార్డు క్రియేట్ చేసింది ఆఫ్గనిస్తాన్.
ఈ ఓటమితో గ్రూప్ స్టేజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకేట్ ని ట్రోల్ చేయడం ప్రారంభించారు భారత క్రీడాభిమానులు. ఎందుకంటే గతంలో ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ అన్న మాటలే ఇప్పుడు ఈ ట్రోల్స్ కి కారణం. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ – భారత్ మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. 3 వన్డేలలోనూ ఇంగ్లాండ్ ఓటమిపాలై వైట్ వాష్ కి గురైంది.
అయితే సిరీస్ అనంతరం ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ మాట్లాడుతూ.. ” ఈ సిరీస్ అంత ఇంపార్టెంట్ కాదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియాను ఓడించబోతున్నాం. మేం ఇండియా ని ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఓడిస్తే.. అప్పుడు ఈ ఓటమిన్ ఎవరూ గుర్తించుకోరు” అంటూ ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. దీంతో అతడు చేసిన కామెంట్స్ పై మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు.
కట్ చేస్తే ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో గ్రూప్ స్టేజ్ నుండే ఇంగ్లాండ్ ఎలిమినేట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో డకేట్ పై సోషల్ మీడియాలో {Trolls on Ben Duckett} పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు భారత క్రీడాభిమానులు. ఇక బుధవారం ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో డకేట్ 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 38 పరుగులు చేసి పెవిలియన్ చేరిన డకేట్.. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డుని సాధించాడు. 21 ఇన్నింగ్స్ లలో 6 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీల సాయంతో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు.
Ben Duckett said – "If we lose 3-0 to India, I don't care as long as we beat them in the Champions Trophy Final". (During India series).
– ENGLAND OUT OF CHAMPIONS TROPHY IN LEAGUE STAGES..!!!! pic.twitter.com/Dcw83sT1IB
— Tanuj Singh (@ImTanujSingh) February 26, 2025