E-Paper
Advertisement

U19 Asia Cup 2025 Final: మా బూట్లు నాకండి రా..పాకిస్తాన్ బౌల‌ర్ కు వైభ‌వ్,ఆయూష్‌ స్ట్రాంగ్ కౌంట‌ర్

U19 Asia Cup 2025 Final: మా బూట్లు నాకండి రా..పాకిస్తాన్ బౌల‌ర్ కు వైభ‌వ్,ఆయూష్‌ స్ట్రాంగ్ కౌంట‌ర్
Advertisement

U19 Asia Cup 2025 Final: ఆసియా కప్ అండర్ 19, 2025 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025 ) విజేతగా పాకిస్తాన్ జట్టు నిలిచింది. టీమిండియా అండర్ 19 జట్టుపై ( India U19 ) ఏకంగా 191 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ లో రెండు వివాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ బౌలర్ అలీ రజా వర్సెస్ ఆయుష్ మాత్రే, 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

నా బూట్లు నాకండి అంటూ వైభవ్ అదిరిపోయే కౌంటర్

Advertisement

ఆసియా కప్ అండర్ 19, 2025 టోర్నమెంట్ ( ACC Mens U19 Asia Cup 2025 ) ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు కాస్త ఓవరాక్షన్ చేశారు. టీమిండియా ( India U19 ) బ్యాటర్లు త్వరగా ఔట్ అవుతున్న నేపథ్యంలో రెచ్చిపోయారు పాకిస్తాన్ బౌలర్లు. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్ బౌలర్ అలీ రజా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అతనికి కోపం తెప్పించాడు. ఇక అలీ రాజా రెచ్చిపోవడంతో వెంటనే కౌంటర్ ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీ. మీ స్థానం నా కాళ్ళ కింద… మా అందరి బూట్లు నాకండి రా అంటూ సైగలు చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇక అంతకు ముందు ఆయుష్ మాత్రే కూడా కాస్త, ర‌జాపై సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యాడు. ఏమన్నావ్ రా అన్నట్లుగా పాకిస్తాన్ బౌలర్ అలీ రాజాపై రెచ్చిపోయాడు. ఇప్పుడు ఈ రెండు సంఘ‌ట‌నలు హాట్ టాపిక్ అయ్యాయి.

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్

అండర్ 19 ఆసియా కప్ 2025 ( ACC Mens U19 Asia Cup 2025 ) టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఫైన‌ల్ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్ట‌పోయి, 347 ప‌రుగులు చేసింది. ఇక ఆ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో 156 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది టీమిండియా.  ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఆసియా కప్ అండర్ 19 టైటిల్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది పాకిస్తాన్. 1989లో ఇండియా ఈ టైటిల్ గెలవగా, 2003 సంవత్సరంలో కూడా టీమిండియానే విజయం సాధించింది. 2012లో ఇండియా లాగే పాకిస్తాన్ రెండు జట్లు కూడా టైటిల్ షేర్ చేసుకున్నాయి. 2013, 2016 సంవత్సరాలలో కూడా ఛాంపియన్గా టీమిండియా నిలిచింది. 2017 లో ఆఫ్ఘనిస్తాన్ ఛాంపియన్గా నిలిచింది. 2018, 2019, 2021లో ఇండియా మరోసారి చరిత్ర సృష్టించింది. 2023 అలాగే 2024 లో బంగ్లాదేశ్ ఛాంపియన్ గా నిలవడం జరిగింది. ఇక 2025 లో పాకిస్తాన్ గెలుచుకుంది.

Advertisement

 

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

 

 

 

 

 

 

 

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×