BigTV English

Umran malik : వన్డే అరంగేట్రంలోనే ఉమ్రాన్‌ మాలిక్ స్పీడ్ అదుర్స్..

Umran malik : వన్డే అరంగేట్రంలోనే ఉమ్రాన్‌ మాలిక్ స్పీడ్ అదుర్స్..

Umran malik : అతడు ఆడుతున్నది తొలి వన్డే మ్యాచ్. అది న్యూజిలాండ్ గడ్డ. పేస్ కు అనుకూలించే ఆక్లాండ్ పిచ్ . మనోడు అసలే స్పీడ్ స్టార్. ఇంకేముంది తన బంతుల వేగాన్ని ప్రత్యర్థి బ్యాటర్లకు చూపించాడు. ఆరంభంలోనే ఇద్దరు బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ఆ స్పీడ్ స్టార్ ఎవరో కాదు టీమిండియా పేస్ సంచలనం 23 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్. వన్డే అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్ చూపించాడు. నిలకడగా 145 కి.మీకిపైగా వేగంతో బంతులు సంధించాడు. కివీస్‌ బ్యాటర్లకు సవాల్ విసిరాడు. తన తొలి ఐదు ఓవర్లలో కేవలం 19 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే, తన చివరి ఐదు ఓవర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రభావం చూపలేకపోయాడు.


16వ ఓవర్‌లో తొలి బంతికి కివీస్‌ ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే (24)ను ఔట్‌ చేయడం ద్వారా వన్డేల్లో తన తొలి వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఈ ఓవర్‌లో రెండో బంతినే 153.1 కి.మీ. వేగంతో విసిరి ఆశ్చర్య పరిచాడు. తన ఐదో ఓవర్‌లో డారిల్ మిచెల్ (11)ని పెవిలియన్‌కి పంపి రెండో వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ 10 ఓవర్లు బౌలింగ్‌ చేసి 66 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ లో స్పీడ్ బౌలింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు ఉమ్రాన్ మాలిక్. ప్రతి మ్యాచ్ లో నిలకడగా 145 కి.మీ. వేగంతో బంతులు వేస్తూ స్పీడ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. గత రెండు ఐపీఎల్ సీజన్ ల్లో మంచి బౌలింగ్ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటికే ఐర్లాండ్ పర్యటనలో టీ20లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 3 టీ20 మ్యాచ్ లు ఆడిన ఉమ్రాన్ మాలిక్ 9 ఓవర్లు బౌలింగ్ చేసిన 112 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.


టీ20ల్లో వచ్చిన అవకాశాన్ని ఉమ్రాన్ మాలిక్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కానీ అతని టాలెంట్ పై నమ్మకం ఉంచి సెలక్టర్లు వన్డేల్లోనూ స్థానం కల్పించారు. ఆరంభ ఓవర్లలో మెరుగ్గా బంతులు వేయడం..చివరి ఓవర్లలో పరుగులు ధారాళంగా ఇవ్వడం .ఇది భారత్ బౌలర్లకు ఉన్న బలహీనత. ఇదే బలహీనత ఉమ్రాన్ మాలిక్ లోనూ కనిపిస్తోంది. ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే కచ్చితంగా భారత్ జట్టులో రెగ్యులర్ బౌలర్ గా అవకాశాలు దక్కడం ఖాయం. పేస్ లో నియంత్రణ తెచ్చుకుంటే ఉమ్రాన్ ప్రపంచస్థాయి బౌలర్ అవుతాడని క్రికెట్ నిపుణులు చెబుతున్న మాట. మరి ఉమ్రాన్ ఈ లోపాన్ని సరిచేసుకుంటే మంచి బౌలర్ గా ఎదగడం ఖాయం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×