E-Paper
Advertisement

Vijay Mallya On RCB: అప్ప‌ట్లో RCBని కొంటే న‌వ్వి ఎగ‌తాళి చేశారు..కానీ ఇప్పుడు నోర్లు మూసుకుంటున్నారు

Vijay Mallya On RCB: అప్ప‌ట్లో RCBని కొంటే న‌వ్వి ఎగ‌తాళి చేశారు..కానీ ఇప్పుడు నోర్లు మూసుకుంటున్నారు
Advertisement

Vijay Mallya On RCB:    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ( Royal Challengers Bangalore ) జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ ( Aditya Birla Group) కొనుగోలు చేసింది. ఆదిత్య బిర్లాతోపాటు మరో మూడు కంపెనీలు ఈ షేర్లను కొనుగోలు చేశాయి. దాదాపు రూ.16,700 కోట్లు పెట్టి రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టును సొంతం చేసుకున్నారు. అయితే బెంగళూరు జట్టు పైన కోట్ల వర్షం కురిసిన నేపథ్యంలో విజయ్ మాల్యా ( Vijay Mallya) స్పందించారు. అప్ప‌ట్లో RCBని కొనుగోలు చేస్తే, న‌వ్వి ఎగ‌తాళి చేశారు..కానీ ఇప్పుడు నా వ‌ల్లే కోట్ల వ‌ర్షం కురిసిందని విజ‌య్ మాల్యా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన దూరదృష్టి కారణంగానే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఈ రేంజ్ లో డబ్బులు వచ్చాయని పేర్కొన్నారు.

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

RCBని కొనుగోలు చేస్తే, న‌వ్వి ఎగ‌తాళి చేశారు

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును 16,700 కోట్లు పెట్టి ఆదిత్య బిర్లా గ్రూప్ మరో మూడు కంపెనీలు కొనుగోలు చేశాయి. అయితే బెంగళూరు జట్టుపై కోట్ల వర్షం కురిసిన నేపథ్యంలో మాజీ ఓనర్ విజయ్ మాల్యా స్పందించారు. ఐపీఎల్ ప్రారంభంలో బెంగళూరు జట్టును తాను కొనుగోలు చేస్తే కొంత మంది ఎగతాళి చేసి నవ్వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అదే జట్టు కోట్ల వర్షం కురిపించిందని గుర్తు చేశారు. తన దూర దృష్టి కారణంగానే బెంగళూరు జట్టుకు ఇప్పుడు భారీ ధర పలికిందని పేర్కొన్నారు. అప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు ఎక్కువ ధర వచ్చిన నేపథ్యంలో నోళ్లు మూసుకున్నారని చురకలు అంటించారు. తన విజన్ అప్పుడు ఎవరికి అర్థం కాలేదని.. భారీ ధర వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారని వెల్లడించారు మాల్యా.

2008లో RCB జట్టులో విజయ్ మాల్యా ఎన్ని కోట్లకు కొన్నాడంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం అంటే 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసింది విజయ్ మాల్యానే. ఆ సమయంలో 111.6 డాలర్ల మిలియన్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను కొనుగోలు చేశాడు. అంటే 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర 476 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఆ ధర నాలుగింతలైంది. 16,700 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పలికింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బ్లాక్ స్టోన్, డేవిడ్ బ్లిట్జ‌ర్ లాంటి నాలుగు కంపెనీలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తాజాగా కొనుగోలు చేశాయి. ఇందులో మెజారిటీ షేర్లు ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదిత్య బిర్లా గ్రూపు ఓనర్ ఆర్య మాన్ బిర్లా…RCB జట్టుకు చైర్మన్ కాబోతున్నారు. ఇతను రాజస్థాన్ రాయల్స్ జట్టులో గతంలో ప్లేయర్ గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బెంగళూరు ఓనర్ గా మారిపోయాడు. అటు ఆర్యామన్ బిర్లా సోదరి అనన్య బిర్లా బెంగళూరు జట్టును ప్రమోట్ చేయనున్నారు. కావ్య పాపలాగా ప్రతి మ్యాచ్ రాబోతున్నారు.

Advertisement

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×