BigTV English

Virat Kohli Called to RCB Women Team: కంగ్రాట్స్.. ఆర్సీబీ అమ్మాయిలకు విరాట్ ఫోన్!

Virat Kohli Called to RCB Women Team: కంగ్రాట్స్.. ఆర్సీబీ అమ్మాయిలకు విరాట్ ఫోన్!
kohli

Virat Kohli congratulating RCB Women Team on Video Call: ఐపీఎల్ ప్రారంభమై నేటికి 17 ఏళ్లు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి ట్రోఫీ అందని ద్రాక్షగానే ఉండిపోయింది. కోహ్లీలాంటి ఆటగాడు ఉండి కూడా పురుషుల జట్టు పైనల్ వరకు వెళ్లింది కానీ, కప్ మాత్రం గెలవలేక పోయింది. అయితేనేం.. వాళ్లు గెలవకపోయినా స్మృతి మంథాన నేతృత్వంలోని అమ్మాయిల జట్టు టైటిల్ గెలిచి ఆర్సీబీ ముచ్చట తీర్చేసింది.


ఎవరు గెలిస్తే ఏటి? ఆట.. ఆటే కదా.. మొత్తానికి ఆర్సీబీ టైటిల్ సాధించేసింది. అని నెట్టింట అభినందనల వర్షం కురుస్తోంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో  ఆర్సీబీ ఉమెన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ సందర్భంగా అమ్మాయిలు సెలబ్రేషన్స్ లో ఉండగా  స్మృతి మంధానకు ఒక వీడియో కాల్ వచ్చింది. అందరూ ఎవరు? ఎవరాని చూస్తా ఉంటే, ఇంకేటి? అందులో విరాట్ కొహ్లీ ఉన్నాడు.

అంతే వావ్…అంటూ అమ్మాయిలు ఒక్కసారి పట్టరాని సంతోషంతో ఎగిరి గంతులేశారు. విరాట్ అభినందనలతో ఉప్పొంగిపోయారు.


Also Read: కప్ ఎగరేసుకుపోయిన బెంగళూరు.. ఉమెన్స్ ఐపీఎల్ విజేత ఆర్సీబీ..

కెప్టెన్ ని, టీమ్ సభ్యులని పేరు పేరునా విరాట్ అభినందించాడు. ఇప్పుడీ కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది.

చివరి మ్యాచ్‌లో మంథాన జట్టు 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే ఛేదించింది.  శ్రేయాంక పాటిల్ కీలకమైన నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు స్కోరుని కట్టడి చేసింది. వారి లక్ష్యం కొంచెం ఎక్కువైనా ఆర్సీబీ ఇబ్బంది పడేది. ఎందుకంటే 114 పరుగుల చేయడానికి వీరు కూడా 19.3 ఓవర్లు తీసుకున్నారు.

స్కోరు తక్కువ ఉంది కాబట్టి, వికెట్లు పారేసుకోకుండా ఆడారని అంటున్నారు. అదే ఎక్కువైతే రాంగ్ షాట్లు కొట్టి అవుట్ అయ్యేవారు కదాని సోషల్ మీడియాలో ఒక స్మాల్ వార్ నడుస్తోంది.

ఆర్సీబీని అభినందించిన వారిలో సౌరభ్ గంగూలీ, మహ్మద్ షమీ, వెంకటేష్ ప్రసాద్, గ్లెన్ మాక్స్‌వెల్, మయాంక్ అగర్వాల్, యుజ్వేంద్ర చాహల్‌తో పాటు , వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు క్రికెటర్లు ఉన్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×