BigTV English
Advertisement

Electoral Bonds: ఎస్‌బీఐకి మరోసారి డెడ్‌లైన్‌ పెట్టిన సుప్రీంకోర్టు

Electoral Bonds: ఎస్‌బీఐకి మరోసారి డెడ్‌లైన్‌ పెట్టిన సుప్రీంకోర్టు

Electoral Bonds


Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. SBI వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని SBIకి సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా సరే SBI ఆ డేటాను ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు నిలదీస్తూ డెడ్ లైన్ విధించింది. మార్చి 21వ తేదీలోగా నెంబర్లతో పాటుగా అన్ని వివరాలను ఈసీకి సమర్పించాలని సుప్రీంకోర్టు SBIకి ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్ బాండ్ల డేటాను అందించిన SBI వాటి నెంబర్లు మాత్రం అందజేయలేదు. వీటిని వెంటనే సమర్పించాలను SBIకి ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే SBI మాత్రం సుప్రీం ఆదేశాలను పక్కనపెట్టింది. దీంతో మార్చి 21వ తేదీలోగా ఎన్నికల బాండ్ల నెంబర్లతో కూడిన పూర్తి సమాచారాన్ని ఈసీకి సమర్పించాలను తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం SBIకి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల విషయంలో ప్రతి విషయం బయటకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు SBIకి తేల్చి చెప్పింది.


ఎన్నికల బాండ్ల విషయంలో SBI సెలెక్టివ్ గా వ్యవహరించకూడదని, వీటికి సంబంధించిన ప్రతి విషయం ప్రజల ముందుకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏ విషయాన్ని అణిచివేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ధర్మాసనం తెలిపింది. ఏ దాత ఎంతెంత విరాళం ఏ పార్టీకి ఇచ్చారనే విషయంతో కూడిన నెంబర్లను ఈసీకి ఇవ్వాల్సిందేనని.. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు తేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో మార్చి 21 (గురువారం) సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీంకోర్టులో పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈసీకి ఈ వివరాలు అందిన వెంటనే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరచాలని స్పష్టం చేసింది.

Also Read: ED Notices to Kejriwal : కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు.. విచారణకు రారని ప్రకటించిన ఆప్

ఫిబ్రవరిలో ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2019 నుంచి జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని SBIని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేకరు SBI సీల్డు కవరులో పెట్టి రెండు దశల్లో డేటాను ఈసీకి అందించింది. SBI అందజేసిన ఈ డేటాలో బాండ్లు జారీ చేసిన తేదీలు, సొమ్ము వివరాలు, ఏ ఎస్బీఐ బ్రాంచ్ జారీ చేసిందనే పూర్తి వివరాలు మాత్రమే ఉన్నాయి. ఏ దాత ఇచ్చాడో తెలుసుకోవడానికి వీలైన బాండ్ల నెంబర్లు మాత్రం వెల్లడించిందలేదు. దీంతో ఈ విషయాలు వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు SBIకి డెడ్ లైన్ పెట్టింది.

Tags

Related News

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

Big Stories

×