BigTV English

Kohli Performance in World Cup 2024: అంతా ఒకే కానీ.. ఇక విరాట్ కోహ్లీ యే బాకీ ఉన్నాడు..!

Kohli Performance in World Cup 2024: అంతా ఒకే కానీ.. ఇక విరాట్ కోహ్లీ యే బాకీ ఉన్నాడు..!

Virat Kohli’s Poor Performance in T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా సగర్వంగా సెమీస్ కి చేరింది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ విరాట్ కోహ్లీ ఆట తీరు.. అందరికీ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఐపీఎల్ లో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ అందుకున్న తను, ఎందుకిలా ఆడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే టీమ్ ఇండియాలో అందరూ సెట్ అయ్యారు.


ఒక్క కోహ్లీ, రవీంద్ర జడేజా తప్ప అంటున్నారు. వీరిద్దరే బాకీ ఉన్నారని అంటున్నారు. ఆఖరికి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడి, తను ఒడ్డున పడిపోయాడు.. ఇక విరాట్ కీలకమైన సెమీఫైనల్, ఫైనల్ లో ఆడి ప్రపంచ కప్ తీసుకురావాలని అభిమానులు కోరుతున్నారు.

అయితే విరాట్ కోహ్లీ టీ 20 ప్రపంచకప్ లో అప్పుడే రెండు డక్ అవుట్లు అయిపోయాడు. ఇప్పటికి 6 మ్యాచ్ లు ఆడి, 66 పరుగులు చేశాడు. 6.. 6.. 6.. అంటూ నెట్టింట అప్పుడే ట్రోలింగ్ మొదలైంది.


Also Read: సెమీస్‌కు టీమిండియా.. ఆసీస్‌పై ఘనవిజయం..

కెరీర్ లో అతితక్కువ సార్లు మాత్రమే పరుగులు చేయకుండా తను పెవెలియన్ కి చేరాడు. అంతేకాదు ఒక టీ 20 ప్రపంచకప్ లో రెండు సార్లు డకౌట్ అయిన భారత బ్యాటర్ గా ఒక చెత్త రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ స్కోరు.. 1, 4,0, 24, 37, 0 గా ఉన్నాయి.

ఈ విషయంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ తను వికెట్ల ముందు నిలుచునే విధానంలో లోపం ఉందని అన్నాడు. బాల్ వచ్చే ముందు బ్యాలెన్స్ సరిగా ఉండటం లేదు. ఆ చిన్న ఖాళీ కారణంగా అతని షాట్ సెలక్షన్ మిస్ అవుతోంది. క్యాచ్ లు వెళుతున్నాయి. తను కొంత సేపు క్రీజులో ఉంటే సెట్ అయిపోతాడు. ప్రోబ్లం ఏమీ ఉండదని అన్నాడు.

Also Read: Ex Pakistan Captain Inzamam : బాల్ టాంపరింగ్ చేశారు : భారత్ పై ఇంజమామ్ ఆరోపణలు

నిజానికి టీమ్ మేనేజ్మెంట్ తనని ఓపెనర్ గా పంపి, కోహ్లీ కెరీర్ తో ఆటలాడుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ప్రశాంతంగా ఫస్ట్ డౌన్ లో ఆడేవాడిని తీసుకువెళ్లి, తన ఆటను పాడు చేశారని టీమ్ మేనేజ్మెంట్ ని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సెమీఫైనల్ లో యథాతథంగా ఫస్ట్ ఆడించమని అంటున్నారు. దీనిపై ఇప్పుడు పలు మీమ్స్ వైరల్ గా మారాయి.

Related News

Mohammed Siraj : టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ రిటైర్మెంట్..?

Mohammed Siraj : హైదరాబాద్ లో సిరాజ్ హోటల్… ఒక్కో ఐటమ్ ధర ఎంతంటే.. ఇవి మాత్రం కచ్చితంగా రుచి చూడాల్సిందే

Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..

Asia Cup 2025: దరిద్రంగా మారిన గిల్ ఎంపిక… తుది జట్టులో అభిషేక్ శర్మకు నో ఛాన్స్.. ఫైర్ అవుతున్న అభిమానులు !

IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !

Wankhede Stadium : మునిగిన ముంబై.. వాంఖడే స్టేడియంలోకి భారీగా వరద.. ఈ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×