BigTV English

MS Dhoni: వీల్ చైర్ పై మహిళ… ధోని చేసిన పనికి అందరూ షాక్ అవ్వాల్సిందే

MS Dhoni: వీల్ చైర్ పై మహిళ… ధోని చేసిన పనికి అందరూ షాక్ అవ్వాల్సిందే

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెప్టెన్ గా ఎంతో ఘనత సాధించాడు ధోని. అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన తరువాత కేవలం ఐపిఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. తన అభిమానుల కోసమే ఐపీఎల్ లో కొనసాగుతున్నానని తెలిపిన ధోని.. ఈ సీజన్ లోను ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ధోని కోసమే ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లు చూసేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారు.


 

ధోని అంటే పడి చచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు. ధోని బ్యాటింగ్ చూసేందుకు సీఎస్కే బ్యాటర్లు అవుట్ అవ్వాలని కూడా కోరుకునేంత పిచ్చి వాళ్లది. సీఎస్కే జట్టు ఓడిపోయినా పరవాలేదు.. ధోని బాగా ఆడితే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ధోని ఆడితే చూసి అంతలా ఆనందిస్తారు. ఇక ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్స్ కోసం అతడిని చుట్టేస్తుంటారు. అలాగే మహిళా అభిమానులు కూడా ధోనీకి అదే స్థాయిలో ఉన్నారు. అయితే ఓ మహిళా అభిమాని పట్ల తాజాగా ధోని ప్రవర్తించిన తీరు చూసి అందరూ షాక్ అయ్యారు.


ఓ విమానాశ్రయం నుండి బయటకు వెళుతున్న ధోని.. అక్కడే వీల్ చైర్ లో కూర్చున్న ఆ మహిళా అభిమాని వద్దకు వెళ్లాడు. ఆ మహిళ సెల్ఫీ కావాలని ధోనీని అడిగిన వెంటనే.. ఆమెన్ ఫోన్ తీసుకున్న ధోని సెల్ఫీ ఇచ్చాడు. దీంతో వీల్ చైర్ లో ఉన్న మహిళకు ధోని ఇచ్చిన సెల్ఫీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఐపీఎల్ లో 2008 ప్రారంభ సీజన్ నుండి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా ఉన్నాడు.

అతడి సారధ్యంలోనే చెన్నై ఐదు టైటిల్స్ సాధించింది. కానీ 2022 సీజన్ కి ముందు ధోని చెన్నై కెప్టెన్సీ ని వదులుకున్నాడు. వయసు రిత్యా జట్టుకు మరో కెప్టెన్ ని తయారు చేయాలనే ఉద్దేశంతో జట్టులోని స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకి ధోని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. కానీ అతడి సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన చేయడంతో సీజన్ మధ్యలోనే మళ్లీ జట్టు పగ్గాలను ధోని అందుకున్నాడు. ఇక 2023 ఐపీఎల్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ ని ఛాంపియన్ గా నిలబెట్టాడు.

 

ఆ తర్వాత ఐపీఎల్ 2024 నుండి తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ ని ప్రకటించాడు. అప్పటినుండి రుతురాజ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ లో తాజాగా గాయంతో రుతురాజ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కావడంతో మళ్ళీ సిఎస్కే పగ్గాలు ధోనీ చేతికి చిక్కాయి. ఇక ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్.. కేవలం రెండు మ్యాచ్లలో విజయం సాధించి, మరో ఐదు మ్యాచ్లలో ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×