Hyderabad News: అసలే ఎండాకాలం.. రోజు రోజుకూ పెరుగుతున్న ఎండలకు నీటి వినియోగం అధికమవుతోంది. నగరంలోకి కొన్నిప్రాంతాల్లో నీటికి కటకట ఏర్పడింది. చాలా ప్రాంతాల ప్రజలు వాటర్ ట్యాంకర్లను నమ్ముకుంటున్నారు. వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ అమాంతంగా పెరగడంతో హైదరాబాద్ జలమండలి అటువైపు ఫోకస్ చేసింది.
నగరంలో జలమండలి అధికారులు దాడులు
నగరానికి సరిపడిన నీరు ఇస్తున్నా, ఎంతకు తగ్గుతోందని అధికారులు తలలు పట్టుకున్నారు. జలమండలి సరఫరా చేస్తున్న వాటర్ పైపు లైన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నట్లు తేలింది. దీనిపై వాటర్ విభాగం అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో రెండురోజులుగా ‘మోటార్ ఫ్రీ టాప్’ డ్రైవ్ పేరుతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ దాడుల్లో ఊహించని నిజాలు బయటపడ్డాయి.
అక్రమ మోటార్ల వినియోగంపై జలమండలి అధికారులు దాడులు తీవ్రతరం చేశారు. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్‌లో భాగంగా 134 అక్రమ మోటార్లను గుర్తించారు. సిటీ వ్యాప్తంగా 38 మంది వినియోగదారులకు జరిమానా విధించారు. ఎస్సార్ నగర్, మధురానగర్ ప్రాంతాల్లో పర్యటించారు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి.
‘మోటార్ ఫ్రీ టాప్’ డ్రైవ్
హాస్టళ్లు, వ్యాపార సముదాయాలున్న ప్రాంతంలో లోప్రెషర్ రావడంతో తనిఖీలు చేశారు. మధురానగర్‌లో నల్లాకు రెండు హార్స్ పవర్ మోటార్‌ను ఉపయోగించారు వినియోగ దారులు. ఆయా మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఇది రిపీట అయితే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయా హాస్టల్‌కు నెల వరకు నీటి సరఫరా నిలిపివేశారు.
ALSO READ: జపాన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఇండియా హౌస్‌లో విందు
ట్యాంకర్ బుక్ కాకుండా వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. మరో భవనానికి వ్యవసాయ మోటార్ ఉపయోగించడంతో కనెక్షన్ తొలగించారు. ట్యాంకర్ కూడా సరఫరా నిలిపివేయాలని సూచించారు వాటర్ ఎండీ. ఒక్కమాటలో చెప్పాలంటే ఎస్సార్‌నగర్ డివిజన్‌లో అత్యధికంగా 20 మోటార్లు సీజ్ చేశారు అధికారులు.
మోటార్లు సీజ్, ఆపై కనెక్షన్లు కట్
గడిచిన రెండురోజుల్లో హైదరాబాద్ వాటర్ బోర్డు 64 విద్యుత్ మోటార్లను స్వాధీనం చేసుకుంది. నగరంలో 84 మంది వినియోగదారులకు జరిమానా విధించింది. ఇలాంటిది మళ్లీ పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రూ. 5,000 జరిమానా తప్పదని హెచ్చరించారు. దయ చేసి వినియోగదారులు పైపు లైన్లకు మోటార్లను అటాచ్ చేయవద్దని కోరారు.
వాటర్ విభాగం అధికారులు మాత్రం డ్రైవ్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జలమండలి అధికారులు తీసుకుంటున్న చర్యలను చాలా ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సిటీలో వివిధ ప్రాంతాల్లో యువతీయువకులు హాస్టల్‌లో ఉంటున్నారు. దీని కారణంగా మోటార్‌తో నీటిని తోడేయడం ఎక్కువగా ఉందన్నది కొందరు అధికారుల మాట. వారిని కంట్రోల్ చేయగలిగితే వాటర్ ఫ్రెజర్ బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.