World Cup final... these 15 people will go to England

World Cup final:- ఐపీఎల్ అయిపోగానే వరల్డ్ కప్ ఫైనల్… ఇంగ్లండ్ వెళ్లేది ఈ 15 మందే

World Cup final... these 15 people will go to England
Share this post with your friends

World Cup final:- టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు టీమిండియా స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది బీసీసీఐ. అనూహ్యంగా అజింక్యా రహానే ఈ జట్టులో ఉండడం నిజంగా సర్‌ప్రైజింగ్. బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో.. అనుకోకుండా అజింక్యాకు అవకాశం వచ్చింది. పైగా ఈ సీజన్ ఐపీఎల్‌లో ఫస్ట్ టైం బ్యాట్‌కు పనిచెప్పాడు. అంటే… ఫామ్ లోకి వచ్చినట్టే. ఇక ఆ ఫామ్ కొనసాగించడమే మిగిలి ఉంది. పైగా ఇంగ్లండ్‌లో రహానేకు మంచి ట్రాక్ రికార్డే ఉంది.

రోహిత్ సేన‌లోకి ర‌హానేతో పాటు కొంత మంది ప్లేయ‌ర్లు కూడా స‌ర్‌ప్రైజింగ్‌ ఎంట్రీ ఇచ్చారు. జూన్‌ 7వ తేదీన ఓవల్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌నున్న టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు కేఎస్ భ‌ర‌త్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ ను కూడా సెలెక్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యమే. తెలుగు కుర్రాడు కేఎస్‌ భరత్‌ను వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేసింది. ఆల్-రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా జట్టులోకి తిరిగి వచ్చారు.

ఇంకో సెన్సేషన్ ఏంటంటే… మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు కల్పించకపోవడం. సూర్యకుమార్ యాదవ్ ఈమధ్య స్కోర్లన్నీ గోల్డెన్ డకౌట్లే. వన్డే, టెస్ట్ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లోనూ అదే పేలవ ఫామ్ కొనసాగించాడు. లాస్ట్ మూడు మ్యాచ్‌ల నుంచి మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నాడు. టెస్ట్ వరల్డ్ కప్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టి హిట్టర్స్ కంటే.. నిలకడగా ఆడేవాళ్లే కావాలి. అందుకే, సూర్య కుమార్ యాదవ్ ను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

15 మంది టెస్టు స్క్వాడ్‌లో రోహిత్ శ‌ర్మ‌, శుభ‌మ‌న్ గిల్‌, చ‌టేశ్వ‌ర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా ర‌హానే, కేఎల్ రాహుల్‌, కేఎస్ భ‌ర‌త్‌, ర‌విచంద్ర అశ్విన్‌, ర‌వీంద్ర జడేజా, అక్ష‌ర్ ప‌టేల్‌, శార్దూల్ ఠాకూర్‌, ష‌మీ, సిరాజ్‌, ఉమేశ్ యాద‌వ్‌, జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్ ఉన్నారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జూన్ ఏడు నుంచి 11 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది. 12వ తేదీన రిజ‌ర్వ్ డేగా ఉంచారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

WASIM AKRAM : వాళ్లకి తిండి దండగ.. వసీం అక్రమ్ సంచలన కామెంట్స్..

Bigtv Digital

Surya kumar Yadav : టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022.. సూర్య..

Bigtv Digital

Virat Kohli : చరిత్ర సృష్టించిన కోహ్లీ.. 397 పరుగులు చేసిన భారత్.

Bigtv Digital

Test Match : బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్.. పట్టు బిగిస్తున్న భారత్..

BigTv Desk

Dhoni Comments: వరల్డ్ కప్ గెలిచే సత్తా ఇండియాకు ఉంది.. ధోనీ వ్యాఖ్యలు..

Bigtv Digital

Team India : సౌతాఫ్రికాతో మ్యాచ్ కు టీమిండియాలో మార్పులు?

BigTv Desk

Leave a Comment