BigTV English

Yuzvendra Chahal : ఆ ట్యాగ్ తెచ్చుకోవడం కోసం చాహల్ ప్రయత్నం..

Yuzvendra Chahal : ఆ ట్యాగ్ తెచ్చుకోవడం కోసం చాహల్ ప్రయత్నం..
Yuzvendra Chahal


Yuzvendra Chahal : బయట నుండి చూసేవారికి ఏ గేమ్ అయినా ఒకేలా ఉంటుంది. కానీ అందులో లోతు ఎంత ఉంటుంది, అసలు రూల్స్ ఏంటి అని బాగా అవగాహన ఉన్నవారికి మాత్రమే తెలుసు. క్రికెట్ కూడా అలాంటిదే. మామూలుగా క్రికెట్‌ను గేమ్ లాగా కాకుండా ఒక ఎమోషన్ లాగా చూసేవారు చాలామంది ఉంటారు. ఇప్పటివరకు అన్ని క్రికెట్ ఫార్మ్స్‌లో ఒకేవిధంగా ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసినవారు చాలా తక్కువ. ఇప్పుడు దానికోసమే ఒక ఇండియన్ క్రికెటర్ కష్టపడుతున్నాడు.

ఐపీఎల్‌లో ఇండియన్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పేరుపై ఒక రికార్డ్ ఉంది. అదే ఆల్ టైమ్ హయెస్ట్ వికెట్ టేకర్. తాజాగా జరిగిన ఐపీఎల్ తర్వాత వికెట్ టేకర్‌గా నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు చాహల్. వైట్ బాల్ క్రికెట్ విషయంలో కూడా 212 ఇంటర్నేషనల్ వికెట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తనను తాను ప్రూవ్ చేసుకున్నా, ఇండియన్ టీమ్‌తో కొన్నేళ్లుగా ప్రయాణిస్తున్నా.. ఇంకా టెస్ట్ క్రికెట్‌లో చాహల్ డెబ్యూ జరగలేదు. కానీ తనకు టెస్ట్ ఫార్మాట్‌లో ఆడాలని ఉందన్న కోరికను చాహల్ తాజాగా బయటపెట్టాడు.


టెస్ట్ క్రికెటర్ అనే ట్యాగ్ కోసం తను ఎదురుచూస్తున్నట్టు చాహల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. యుజ్వేంద్ర చాహల్ టెస్ట్ ఫార్మాట్ ఆడకపోయినా.. చాలామంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. వారు కూడా తను టెస్ట్‌లో ఆడితే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ సెలక్టర్స్ అనేవారు చేతిలో చాలావరకు క్రికెటర్ల జీవితాలు ఉంటాయి. క్రికెట్ ఫార్మాట్, ఆడే ప్రాంతం, తలపడే టీమ్స్.. ఇలా అన్ని దృష్టిలో పెట్టుకునే గెలిపిస్తారు అని నమ్మే ప్లేయర్స్‌కే వారు ఓటేస్తారు. కానీ టెస్ట్‌లోకి ఎంటర్ అవ్వడానికి తన ప్రయత్నాలు తాను చేస్తానని చాహల్ అంటున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ విషయంలో చాహల్ మంచి గుర్తింపును సాధించాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20ఐ మ్యాచ్‌లో చక్కటి ఆటను కనబరిచాడు. ఇప్పటివరకు తను 75 టీ20ఐల్లో పాల్గొన్నాడు. ఇందులో మొత్తంగా 91 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓడీఐల విషయానికొస్తే.. 72 ఆటల్లో 121 వికెట్లు తీశాడు. టీ20ఐ మాత్రమే కాదు.. చాహల్ ఆడిన చివరి ఓడీఐ కూడా జనవరిలోనే. ఇలా మంచి ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న ఈ యంగ్ క్రికెటర్ టెస్ట్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×