BigTV English
Advertisement

Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ .. అప్పటి వరకు అదే ఆహారం..

Pawan Kalyan : వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్ .. అప్పటి వరకు అదే ఆహారం..


Pawan Kalyan Varahi Tour(Andhra news today): జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి అమ్మవారి నవరాత్రుల దీక్ష చేపట్టారు. నేటి నుంచి దీక్ష ప్రారంభమైంది. దీక్ష సమయంలో జనసేనాని అన్నం తినరు. కేవలం పాలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు.

ఎన్నికల పర్యటన కోసం ఇష్టదైవం వారాహి అమ్మవారి రూపంలోనే వాహనాన్ని స్పెషల్‌గా తయారు చేయించారు పవన్. ఆ రథ యాత్రకు వారాహి అమ్మవారి పేరే పెట్టారు. ఇప్పుడు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష కార్తీక మాసాంతం వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత దీక్షను పవన్ కల్యాణ్ విరమిస్తారు.


రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్‌లో ఇటీవల యాగం నిర్వహించారు పవన్ కల్యాణ్. రెండు రోజులపాటు యాగం నిర్వహించిన తర్వాత అన్నవరం నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర కొనసాగుతోంది.

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తూ జనసేనాని ముందుకుసాగుతున్నారు. బహిరంగం సభల్లో వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర కొనసాగుతోంది. సభలకు భారీగా జనం తరలివస్తున్నారు. దీంతో జనసేన శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.

Tags

Related News

Amaravati News: ప్రమాదకరంగా ‘బ్లూ బ్యాచ్’.. మంత్రి లోకేష్ సూచన, రంగంలోకి పోలీసులు?

Amaravati News: న్యూఇయర్‌కి ముందే.. కూటమి ప్రభుత్వం కొత్త ప్లానేంటి?

West Godavari: పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికో?

Dharmana prasada : కొడుకు ఎంట్రీ.. రాజకీయాలకు ధర్మాన గుడ్ బై..!

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. తప్పు ఎవరిది? అసలు ఏం జరిగింది?

AP Heavy Rains: ఏపీకి మొంథా తుపాను ముప్పు.. బాంబ్ పేల్చిన వాతావ‌ర‌ణ శాఖ‌

Kesineni Vs Kolikapudi: కొలికపూడి కేశినేని మధ్య వార్.. చంద్రబాబు నిర్ణయం ఇదే?

Tdp Tweet: కోడి కత్తి.. కమల్ హాసన్.. టీడీపీ ర్యాగింగ్!

Big Stories

×