Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలింగ్ కంటే ఈమధ్య తన కుటుంబ విషయాల నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు యుజ్వేంద్ర చాహల్. తన భార్య ధనశ్రీ వర్మ కు విడాకులు ఇవ్వబోతున్నాడట యుజ్వేంద్ర చాహల్. 2020లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. గత ఏడాది కాలంగా దూరంగానే ఉంటున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే ఈ ఇద్దరు సెలబ్రిటీల విడాకుల అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: IND VS NZ Final: వరుసగా రెండు క్యాచ్ లు మిస్… గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన షమీ..!
ఈ విడాకుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో… తన భార్య ధనశ్రీ వర్మకు ఊహించని షాక్ ఇచ్చాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. ఓ కొత్త అమ్మాయితో… దుబాయ్ స్టేడియంలో మెరిశాడు చాహల్. ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు టీమిండియా స్టార్ ప్లేయర్లు కూడా దుబాయ్ స్టేడియానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ కూడా స్టేడియంలో మెరవడం జరిగింది. అయితే సింగిల్ గా రాకుండా… ఓ మిస్టరీ అమ్మాయితో వచ్చాడు యుజ్వేంద్ర చాహల్. దీంతో ఆమె ఎవరు అనే దాని పైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ఫోటో వైరల్ కావడంతో చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ధనశ్రీ వర్మ కు విడాకులు ఇచ్చిన తర్వాత…. ఈ అమ్మాయిని యుజ్వేంద్ర చాహల్ పెళ్లి చేసుకోబోతున్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో డేటింగ్ కూడా చాహల్ చేస్తున్నట్లు మరి కొంత మంది అంటున్నారు. నీకు జరిగిన మోసానికి… సరైన గుణపాఠం చెబుతున్నావు అంటూ మరి కొంత మంది యుజ్వేంద్ర చాహల్ కు సపోర్ట్ గా నిలిస్తున్నారు.
ఆ మిస్టరీ గర్ల్ ఎవరు ?
చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ నేపథ్యంలో ఇవాళ దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ కు… యుజ్వేంద్ర చాహల్ తో పాటు వచ్చిన మిస్టరీ గర్ల్ ఎవరు అనే దానిపైన చర్చ జరుగుతోంది. ఆమె పేరు మహ్వాష్ అని తెలుస్తోంది. ఆమె ఫేమస్ rj ఫ్యాషన్, ట్రావెల్ అంతేకాకుండా ఫిట్నెస్ వీడియోలు కూడా చేస్తూ ఉంటుందని చెబుతున్నారు. గతంలో కూడా ఈ ఇద్దరు కలిసి బయట తిరిగిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెబుతున్నారు. ధనశ్రీ వర్మతో విడాకులు సాంక్షన్ అయిన తర్వాత…. ఆ దిశగా టీమిండియా యంగ్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నిర్ణయం తీసుకోబోతున్నాడట. అందుకే ఇప్పటి నుంచే ఆ అమ్మాయితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా విడాకులు తీసుకుంటే… 60 కోట్లు ఇవ్వాల్సిందేనని… కోర్టును ఆశ్రయించిందట చాహల్ భార్య ధనశ్రీ వర్మ. అయితే ఆ డబ్బులు కూడా… చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాడట చాహల్. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా రిటైర్మెంట్… కోహ్లీ హాగ్ ఇచ్చి ?
People are celebrating Chahal, but imagine the outrage if Dhanashree were in the same situation.💀#INDvsNZ pic.twitter.com/z6klb5hfop
— Veena Jain (@DrJain21) March 9, 2025