Ravindra Jadeja: టీమిండియా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja).. వన్డే మ్యాచ్ లకు రిటైర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫైనల్ మ్యాచ్లో హింట్ ఇచ్చాడు రవీంద్ర జడేజా. ఇదే తన చివరి మ్యాచ్ అన్న విధంగా… బౌలింగ్ స్పెల్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ తో పాటు… టీమిండియా ప్లేయర్లకు హాగ్ ఇచ్చాడు రవీంద్ర జడేజా. ముఖ్యంగా విరాట్ కోహ్లీని కౌగిలించుకొని… రవీంద్ర జడేజా ఎమోషనల్ అయిన ఫోటోలు వైరల్ గా మారాయి. టి20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ సమయంలో కూడా… ఇలాగే చేసి రోహిత్ శర్మ అలాగే కోహ్లీ బాటలో రిటైర్మెంట్ ప్రకటించాడు రవీంద్ర జడేజా.
Also Read: IND VS NZ Final: న్యూజిలాండ్ కు చుక్కలు చూపించిన కుల్దీప్…టీమిండియా టార్గెట్ ఎంతంటే ?
మొన్నటికి మొన్న రవిచంద్రన్ అశ్విన్ , స్టీవెన్ స్మిత్ చాలా మంది క్రికెటర్లు… తమ చివరి మ్యాచ్ లో రవీంద్ర జడేజా తరహా లోని హాగ్ ఇచ్చారు. తోటి ప్లేయర్లకు ఎమోషనల్ హగ్ ఇచ్చిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా విరాట్ కోహ్లీ కి హాగ్ ఇచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ చేసాడు. ఇక టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా…. రవీంద్ర జడేజా కూడా అలాగే చేశాడు. దీంతో ఈ మ్యాచ్ పూర్తికాగానే అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు రవీంద్ర జడేజా గుడ్ బై చెప్పబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా వార్తలు ప్రచారం జరిగాయి. టి20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తరహాలోనే ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత కూడా ప్రకటిస్తాడని అందరూ అన్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో… టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి కానీ… మ్యాచ్ పూర్తయిన తర్వాత రవీంద్ర జడేజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఒకవేళ వన్డేలకు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తే.. కేవలం టెస్టు మ్యాచ్ లలో ఇకపై కనిపిస్తాడు. ఇది ఇలా ఉండగా చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో… న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోగా… 251 పరుగులు చేసింది. ఇక 252 పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ అలాగే గిల్ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారు.
Also Read: IND VS NZ Final: వరుసగా రెండు క్యాచ్ లు మిస్… గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన షమీ..!
🚨 Breaking 🚨
Ravindra Jadeja announces his ODI retirement
(Source-Virat Kohli Hug) pic.twitter.com/SWBJmrDsio
— Shah (@IamShah102) March 9, 2025