Kannappa Making Video:మంచు విష్ణు (Manchu Vishnu) ప్రెస్టేజియస్ మూవీగా రాబోతున్న చిత్రం కన్నప్ప (Kannappa). ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohanbabu) నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో.. మోహన్ లాల్ (Mohan Lal), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇందులో ఐశ్వర్య, ముఖేష్ రిషి, కౌశల్ మంద, రఘుబాబు, మధుబాల, బ్రహ్మానందం, ఆర్.శరత్ కుమార్, ప్రీతి ముకుందన్, దేవరాజ్, అర్పిత్ రాంకా , కమెడియన్ సప్తగిరి అంటే భారీ తారాగణం నటించడమే కాకుండా.. మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా కూడా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్న కన్నప్ప..
ఇకపోతే భారీ అంచనాల మధ్య అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పైగా ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భాగమవడంతో అందరూ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా నుంచి పోస్టర్లు రివీల్ చేయగా.. ఆ సెలబ్రిటీల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దీనికి తోడు ఈ సినిమా నుండి ‘శివ శివ’ అనే పాటను విడుదల చేయగా.. పాట బాగా ఆకట్టుకుంది. కానీ విజువల్స్ మాత్రం మెప్పించలేకపోయాయి. ఇకపోతే ఈ సినిమా నుండి రెండు సార్లు టీజర్ విడుదల చేసినా.. అందులో ప్రభాస్ లుక్ మాత్రమే టీజర్ కు హైలెట్గా నిలిచింది. అంతే తప్ప అందులోని పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోవడం గమనార్హం
కన్నప్ప మేకింగ్ వీడియో వైరల్..
ఇకపోతే ఏప్రిల్ 25వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోని తాజాగా విడుదల చేశారు. అందులో భాగంగా మంచు విష్ణు టీం తో కలిసి చర్చిస్తున్న విషయాన్ని చూపించడం జరిగింది. ముఖ్యంగా డ్రెస్సింగ్ దగ్గర్నుండి ప్రతి బిట్టు ఎలా చేయాలి? ఎలా చేస్తే ఆడియన్స్ మెప్పు పొందవచ్చు? అనే విషయాన్ని టీం తో కలిసి విష్ణు చర్చిస్తున్నట్లు మనం ఆ వీడియోలో చూడవచ్చు. ముఖ్యంగా యుద్ధానికి కావలసిన అన్ని ఏర్పాట్లను ఎలా చేయాలని స్కెచ్ వేసి మరీ మంచు విష్ణు అక్కడ టీమ్ తో చర్చిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమా కోసం ఇంత పగడ్బందీగా భారీ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇంక మంచు విష్ణు విషయానికి వస్తే ఇప్పుడు తన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మార్చి 28వ తేదీన తన కెరీర్లో కామెడీ పరంగా భారీ విజయాన్ని అందుకున్న ఢీ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మొదట ఈ సినిమా ద్వారా ఆడియన్స్ లో హైప్ పెంచేసి, ఆ తర్వాత కన్నప్ప సినిమా రిలీజ్ చేయాలని మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ మంచు విష్ణు కన్నప్ప మూవీకి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK
— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025